Telugu Global
International

జూమ్‌ కు పోటీగా దేశీయ యాప్‌... కోటి రూపాయల చాలెంజ్‌

కరోనా కాలంతో అందరూ ఇళ్లకే పరిమితయమ్యారు. దీంతో ఇప్పుడు ఆఫీస్ వర్క్‌తో పాటు ఇతర కార్యక్రమాలు, వీడియో కాన్ఫరెన్స్‌ ల కోసం అందరూ జూమ్‌ యాప్‌ వాడుతున్నారు. ఈ యాప్‌ చైనా కంపెనీ తయారు చేసింది. ఈ యాప్‌ చాలా సమాచారం సేకరిస్తుందని తెలిసింది. దీంతో ఈ యాప్‌ను వాడొద్దని కేంద్రం అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. జూమ్‌కు పోటీగా దేశీయ యాప్‌ను తయారు చేయాలని కేంద్రం ఆలోచిస్తోంది. ఈ యాప్‌ను తయారుచేయాలని మనదేశ కంపెనీలకు కేంద్రం […]

జూమ్‌ కు పోటీగా దేశీయ యాప్‌... కోటి రూపాయల చాలెంజ్‌
X

కరోనా కాలంతో అందరూ ఇళ్లకే పరిమితయమ్యారు. దీంతో ఇప్పుడు ఆఫీస్ వర్క్‌తో పాటు ఇతర కార్యక్రమాలు, వీడియో కాన్ఫరెన్స్‌ ల కోసం అందరూ జూమ్‌ యాప్‌ వాడుతున్నారు. ఈ యాప్‌ చైనా కంపెనీ తయారు చేసింది. ఈ యాప్‌ చాలా సమాచారం సేకరిస్తుందని తెలిసింది. దీంతో ఈ యాప్‌ను వాడొద్దని కేంద్రం అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది.

జూమ్‌కు పోటీగా దేశీయ యాప్‌ను తయారు చేయాలని కేంద్రం ఆలోచిస్తోంది. ఈ యాప్‌ను తయారుచేయాలని మనదేశ కంపెనీలకు కేంద్రం చాలెంజ్‌ విసిరింది. యాప్‌ డెవలప్ చేస్తే కోటి రూపాయలు ఇస్తామని కేంద్రం ప్రకటించింది.

జూమ్‌ యూజర్స్‌ డేటా లీక్‌ అయిందనే సమాచారంతో కేంద్రం ఆ యాప్‌ వాడొద్దని ఆదేశించింది. యాప్‌ను తయారుచేసే ఆసక్తి ఉన్నవారు ఏప్రిల్‌ 30 లోపు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని గడువు విధించారు. జూలై 29న యాప్‌ విజేతను ప్రకటిస్తారు.

ఈ కొత్త యాప్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ అధికారిక కార్యక్రమాల కోసం ఉపయోగిస్తాయని ఐటీ శాఖ తెలిపింది. దీంతో పాటు యాప్ విజేతకు కోటి రూపాయల బహుమతి కూడా ఇస్తారు.

ఇప్పటికే జూమ్‌ యాప్‌ను ఉపయోగించొద్దని గూగుల్‌, సాండర్డ్‌ చార్టర్డ్‌ కంపెనీలు తమ ఉద్యోగులకు సూచించాయి. అమెరికాలో సెనేటర్లు కూడా ఈ యాప్‌ను యూజ్‌ చేయొద్దని సేనెట్‌ కోరింది.

కరోనా టైమ్‌లో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ పెరగడంతో జూమ్‌ యూప్‌ వినియోగం పెరిగింది. పలు రాష్ట్రాలతో పాటు హైకోర్టులో కార్యకలాపాల కోసం ఈయాప్‌ను వినియోగిస్తున్నారు.

అయితే భద్రత కారణాలతో ఈ యాప్‌ను వాడవద్దని ఇప్పుడు కేంద్రం ఆదేశాలు జారీచేసింది. దీంతో ఇప్పుడు ప్రత్యామ్నాయం కోసం అధికారులు వెతుకుతున్నారు. దీనిలో భాగంగా దేశీయ యాప్‌ను తయారు చేసే పనిలో పడ్డారు.

First Published:  21 April 2020 8:57 PM GMT
Next Story