Telugu Global
National

కట్టుబడే ఉన్నా- విజయసాయిరెడ్డి

చంద్రబాబునాయుడుకి కన్నా లక్ష్మీనారాయణ 20 కోట్లకు అమ్ముడుపోయాడన్న ఆరోపణలకు కట్టుబడే ఉన్నానని చెప్పారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. కాణిపాకంలో ప్రమాణం చేసేందుకు సిద్ధమా అంటూ కన్నా విసిరిన సవాల్‌కు కూడా విజయసాయిరెడ్డి స్పందించారు. ఏ ఆలయం వద్దనైనా ప్రమాణం చేయడానికి తాను సిద్ధమని చెప్పారు. కొందరు టీడీపీ వ్యక్తులు బీజేపీలో చేరి ఆపార్టీని నాశనం చేసే పనిలో ఉన్నారని విమర్శించారు. సుజనాచౌదరి బోగస్ కంపెనీలు పెట్టి వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగ్గొట్టారని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. సుజనా […]

కట్టుబడే ఉన్నా- విజయసాయిరెడ్డి
X

చంద్రబాబునాయుడుకి కన్నా లక్ష్మీనారాయణ 20 కోట్లకు అమ్ముడుపోయాడన్న ఆరోపణలకు కట్టుబడే ఉన్నానని చెప్పారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. కాణిపాకంలో ప్రమాణం చేసేందుకు సిద్ధమా అంటూ కన్నా విసిరిన సవాల్‌కు కూడా విజయసాయిరెడ్డి స్పందించారు.

ఏ ఆలయం వద్దనైనా ప్రమాణం చేయడానికి తాను సిద్ధమని చెప్పారు. కొందరు టీడీపీ వ్యక్తులు బీజేపీలో చేరి ఆపార్టీని నాశనం చేసే పనిలో ఉన్నారని విమర్శించారు.

సుజనాచౌదరి బోగస్ కంపెనీలు పెట్టి వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగ్గొట్టారని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. సుజనా చౌదరి బోగస్‌ కంపెనీలను ఎలా సృష్టించారో ఆధారాలతో సహా తాను నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.

బ్యాంకులు ఆర్థికంగా చితికిపోవడానికి సుజనాచౌదరి లాంటి వారే కారణమని విజయసాయిరెడ్డి ఆరోపించారు.

గుజరాత్‌ సీఎంకు జగన్‌ ఫోన్…

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీకి ఫోన్ చేశారు.

గుజరాత్‌లో చిక్కుకున్న తెలుగు మత్స్యకారులను ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. వసతి, భోజన సదుపాయలు కల్పించాలని కోరారు.

ఇందుకు గుజరాత్ సీఎం సానుకూలంగా స్పందించారు. తెలుగువారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.

First Published:  21 April 2020 1:36 AM GMT
Next Story