Telugu Global
National

ఏపీకి రూ. 1892 కోట్లు... తెలంగాణకు రూ.982 కోట్లు విడుదల చేసిన కేంద్రం

కరోనా క్లిష్ట సమయంలో రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్రం విడుదల చేసిన నిధులు ఊరట కలిగించాయి. కేంద్ర పన్నుల్లో రావాల్సిన ఏప్రిల్ నెల వాటాను అన్ని రాష్ట్రాలకు సోమవారం కేంద్రం విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ ఏ రాష్ట్రానికి ఎంత మొత్తం విడుదల చేసిందో పేర్కొంటు ట్విట్టర్‌లో పోస్టు చేసింది. అన్ని రాష్ట్రాలకు కలిపి రూ. 46,038 కోట్లు విడుదల చేయగా…. ఏపీకి పన్నుల వాటా కింద రూ. 1,892.64 కోట్లు, తెలంగాణకు […]

ఏపీకి రూ. 1892 కోట్లు... తెలంగాణకు రూ.982 కోట్లు విడుదల చేసిన కేంద్రం
X

కరోనా క్లిష్ట సమయంలో రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్రం విడుదల చేసిన నిధులు ఊరట కలిగించాయి. కేంద్ర పన్నుల్లో రావాల్సిన ఏప్రిల్ నెల వాటాను అన్ని రాష్ట్రాలకు సోమవారం కేంద్రం విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ ఏ రాష్ట్రానికి ఎంత మొత్తం విడుదల చేసిందో పేర్కొంటు ట్విట్టర్‌లో పోస్టు చేసింది.

అన్ని రాష్ట్రాలకు కలిపి రూ. 46,038 కోట్లు విడుదల చేయగా…. ఏపీకి పన్నుల వాటా కింద రూ. 1,892.64 కోట్లు, తెలంగాణకు రూ. 982 కోట్ల రూపాయలు వచ్చాయి.

ఇక దేశంలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌కు రూ. 8,255.19 కోట్లు, అత్యల్పంగా గోవాకు రూ. 177.72 కోట్లు విడుదలయ్యాయి.

ఏ రాష్ట్రానికి ఎంతెంత..?

– ఆంధ్రప్రదేశ్ రూ. 1,892.64
– అరుణాచల్‌ప్రదేశ్ రూ. 810.64
– అస్సామ్ రూ. 1,441.48
– బీహార్ రూ. 4,631.96
– చత్తీస్‌ఘడ్ రూ. 1,573.60
– గోవా రూ. 177.72
– గుజరాత్ రూ. 1,564.40
– హర్యాణా రూ. 498.15
– హిమాచల్‌ప్రదేశ్ రూ. 367.84
– జార్ఖండ్ రూ. 1,525.27
– కర్ణాటక రూ. 1,678.57
– కేరళ రూ. 894.53
– మధ్యప్రదేశ్ రూ. 3,630.60
– మహారాష్ట్ర రూ. 2,824.47
– మణిపూర్ రూ. 330.56
– మేఘాలయ రూ. 352.20
– మీజోరాం రూ. 232.20
– నాగాలాండ్ రూ. 263.80
– ఒడిషా రూ. 2,131.13
– పంజాబ్ రూ. 823.16
– రాజస్థాన్ రూ. 2,752.65
– సిక్కిం రూ. 178.64
– తమిళనాడు రూ. 1,928.56
– తెలంగాణ రూ. 982.00
– త్రిపుర రూ. 326.42
– ఉత్తర్‌ప్రదేశ్ రూ. 8,255.19
– ఉత్తరాఖండ్ రూ. 508.27
– పశ్చిమ బెంగాల్ రూ. 3,461.65

First Published:  20 April 2020 9:18 PM GMT
Next Story