Telugu Global
Cinema & Entertainment

రియల్ హీరో... అజిత్ సాహసం ఇది

హీరో అజిత్ కు సాహసాలంటే చాలా ఇష్టమనే విషయం చాలామంది తెలుగు ప్రేక్షకులకు తెలియకపోవచ్చు. కానీ ప్రతి తమిళ ప్రేక్షకుడికి అజిత్ అంటే ఏంటో తెలుసు. సాహసాలకు పెట్టింది పేరు ఈ హీరో. ఖాళీ దొరికితే ఏదో ఒక సాహస క్రీడ లేదా ఎడ్వెంచర్ చేయడానికి వెళ్లిపోతుంటాడు ఈ హీరో. అలాంటి అజిత్ తాజాగా మరో సాహసం చేశాడు. ఒంటరిగా బైక్ పై హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్లిపోయాడు. అవును.. ఆమధ్య (లాక్ డౌన్ కంటే ముందు) […]

రియల్ హీరో... అజిత్ సాహసం ఇది
X

హీరో అజిత్ కు సాహసాలంటే చాలా ఇష్టమనే విషయం చాలామంది తెలుగు ప్రేక్షకులకు తెలియకపోవచ్చు. కానీ ప్రతి తమిళ ప్రేక్షకుడికి అజిత్ అంటే ఏంటో తెలుసు. సాహసాలకు పెట్టింది పేరు ఈ హీరో. ఖాళీ దొరికితే ఏదో ఒక సాహస క్రీడ లేదా ఎడ్వెంచర్ చేయడానికి వెళ్లిపోతుంటాడు ఈ హీరో. అలాంటి అజిత్ తాజాగా మరో సాహసం చేశాడు. ఒంటరిగా బైక్ పై హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్లిపోయాడు.

అవును.. ఆమధ్య (లాక్ డౌన్ కంటే ముందు) అజిత్ సినిమా షూటింగ్ ఒకటి హైదరాబాద్ లో జరిగింది. సినిమాలో అజిత్ కోసం ఓ మంచి స్పోర్ట్స్ బైక్ ను ఉపయోగించారు. మరింత స్టయిలిష్ గా రీమోడలింగ్ కూడా చేశారు. ఆ బైక్ అజిత్ కు బాగా నచ్చింది. ఎంత నచ్చిందంటే.. షెడ్యూల్ అయిన తర్వాత కూడా ఆ బైక్ ను విడిచిపెట్టాలని అజిత్ కు అనిపించలేదు. ఎలాగూ సాహసాలంటే ఇష్టం కాబట్టి ఏకంగా అదే బైక్ పై హైదరాబాద్ నుంచి చెన్నైకు బయల్దేరాడు.

దాదాపు 700 కిలోమీటర్ల దూరాన్ని ఒక్కడే బైక్ పై పూర్తిచేశాడు. మధ్యలో పెట్రోల్, ఆహారం కోసం మాత్రమే ఆగాడు ఈ హీరో. అజిత్ చేసిన ఈ ఫీట్ కు అతడి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. కాస్త ఆలస్యంగా సోషల్ మీడియాలోకి వచ్చిన ఆ పిక్స్ బాగా వైరల్ అవుతున్నాయి.

First Published:  21 April 2020 7:00 AM GMT
Next Story