Telugu Global
NEWS

రాపిడ్‌ టెస్ట్‌ కిట్‌లపై ప్రచారానికి ఏపీ ప్రభుత్వం చెక్‌

రాపిడ్ టెస్ట్ కిట్ లు అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారనే ప్రచారానికి ఏపీ ప్రభుత్వం చెక్‌ పెట్టింది. వేరే రాష్ట్రాలకు తక్కువ ధరలకు కిట్ లు విక్రయిస్తే అదే ధర చెల్లిస్తామని ప్రభుత్వం ముందే ఒప్పందం చేసుకుంది. యూనిట్ 730 రూపాయలకు APMSIDC ముందే కొనుగోలు చేసింది. దీంతో ఇప్పుడు చత్తీస్‌గఢ్‌కు 337 రూపాయలకే యూనిట్ విక్రయించడంతో…. ఒప్పందం ప్రకారం యూనిట్ కు 337 మాత్రమే చెల్లిస్తాం అని APMSIDC స్పష్టం చేసింది. శనివారం నాడే రాపిడ్ […]

రాపిడ్‌ టెస్ట్‌ కిట్‌లపై ప్రచారానికి ఏపీ ప్రభుత్వం చెక్‌
X

రాపిడ్ టెస్ట్ కిట్ లు అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారనే ప్రచారానికి ఏపీ ప్రభుత్వం చెక్‌ పెట్టింది. వేరే రాష్ట్రాలకు తక్కువ ధరలకు కిట్ లు విక్రయిస్తే అదే ధర చెల్లిస్తామని ప్రభుత్వం ముందే ఒప్పందం చేసుకుంది.

యూనిట్ 730 రూపాయలకు APMSIDC ముందే కొనుగోలు చేసింది. దీంతో ఇప్పుడు చత్తీస్‌గఢ్‌కు 337 రూపాయలకే యూనిట్ విక్రయించడంతో…. ఒప్పందం ప్రకారం యూనిట్ కు 337 మాత్రమే చెల్లిస్తాం అని APMSIDC స్పష్టం చేసింది. శనివారం నాడే రాపిడ్ కిట్ లు విక్రయించిన సందొర్ మెడికేయిడ్స్ కు ఈ మేరకు సమాచారం ఇచ్చింది.

ఏప్రిల్‌7న ఇచ్చిన పర్చేస్ ఆర్డర్ లో స్పష్టంగా మాకు ఇచ్చిన దానికన్నా తక్కువ రేటుకు ఇతరులకు ఇస్తే కచ్చితంగా అదే రేటు ఇస్తాం అని చెప్పినట్లు…. వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఈమేరకు ఇప్పుడు తక్కువ ధరకు అమ్మారని తెలియడంతో అదే ధర ఇస్తామని లేఖ రాసింది. ఈ లేఖపై కంపెనీ స్పందించింది. కాంట్రాక్టు ప్రకారం తక్కువ ధరకు ఓకే చెప్పింది.

ఇప్పటికే టీడీపీ నేతలు ఈ కిట్‌లపై నెగటివ్‌ ప్రచారం మొదలుపెట్టారు. మొన్నటివరకూ పరీక్షలు పెద్దగా చేయడం లేదు.. అందుకే పాజిటివ్‌ కేసులు తేలడం లేదని వాపోయారు. ఇప్పుడు లక్ష కిట్‌లు రావడంతో వెనక్కి తగ్గారు.

ఇప్పుడు కిట్‌లు ఎక్కువ రేటు పెట్టి కొన్నారని ఓ తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. వాటికి ముందు రేటు నిర్ణయించింది 730 రూపాయలు. కానీ 12 వందల రూపాయలకు కొన్నారని సోషల్‌ మీడియాలో ప్రచారం చేశారు. తీరా ఇప్పుడు వేరే రాష్ట్రానికి తక్కువ ధరకు అమ్మడంతో కాంట్రాక్టు నిబంధనల ప్రకారం ఇప్పుడు తక్కువ ధరకు ఏపీకి కూడా ఇవ్వాల్సి వచ్చింది. 337 రూపాయలకే ఏపీకి కూడా కిట్‌లు ఇస్తామని దక్షిణ కొరియా కంపెనీ ఒప్పుకుంది.

First Published:  19 April 2020 7:59 PM GMT
Next Story