Telugu Global
Cinema & Entertainment

మహేష్ " రాజమౌళి సినిమా... స్టోరీ ఇదేనా?

బాహుబలి లాంటి భారీ బడ్జెట్ సినిమా తీసి ఓవర్ నైట్ దేశవ్యాప్తంగా స్టార్ డైరెక్టర్ అయిపోయాడు రాజమౌళి. ఆయన ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ మూవీ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇద్దరు స్టార్ హీరోలు ఎన్టీఆర్, రాంచరణ్ లను పెట్టి ఈ మూవీ తీస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. లాక్ డౌన్ తో మార్చికి వాయిదా పడవచ్చు అన్న వార్తలు కూడా వస్తున్నాయి. అయితే ఆర్ఆర్ఆర్ తరువాత మహేష్ బాబుతోనే సినిమా […]

మహేష్  రాజమౌళి సినిమా... స్టోరీ ఇదేనా?
X

బాహుబలి లాంటి భారీ బడ్జెట్ సినిమా తీసి ఓవర్ నైట్ దేశవ్యాప్తంగా స్టార్ డైరెక్టర్ అయిపోయాడు రాజమౌళి. ఆయన ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ మూవీ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇద్దరు స్టార్ హీరోలు ఎన్టీఆర్, రాంచరణ్ లను పెట్టి ఈ మూవీ తీస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. లాక్ డౌన్ తో మార్చికి వాయిదా పడవచ్చు అన్న వార్తలు కూడా వస్తున్నాయి.

అయితే ఆర్ఆర్ఆర్ తరువాత మహేష్ బాబుతోనే సినిమా అని రాజమౌళి ప్రకటించాడు. దుర్గాఆర్ట్స్ అధినేత కేఎల్ నారాయణ తనకు అడ్వాన్స్ ఇచ్చారని.. చాలా రోజులుగా పెండింగ్ లో ఉందని.. మహేష్ బాబుతో కలిసి నెక్ట్స్ ఆయన సినిమానే తీస్తానని చెప్పుకొచ్చాడు.

మహేష్ తో రాజమౌళి సినిమా అనగానే టాలీవుడ్ లో పెద్ద బ్రేకింగ్ న్యూస్ అయింది. మహేష్ బాబుతో దిగ్గజ దర్శకుడు రాజమౌళి సినిమా ఎలా ఉండబోతోందన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

దానికి రాజమౌళి గతంలోనే తెరదించడం విశేషం. ‘ఆర్ఆర్ఆర్’ మూవీ అనౌన్స్ మెంట్ లో మహేష్ బాబును ఎందుకు ఈ మూవీలో తీసుకోలేదని విలేకరులు అడగ్గా.. ఈ కథకు ఆయన సరిపోరని.. జేమ్స్ బాండ్ లాంటి కథలో మహేష్ బాబు సూపర్ హీరోగా ఉంటారని.. అలాంటి కథ మహేష్ కు నప్పుతుందని తెలిపారు.

కాగా మహేష్ కోసం రాజమౌళి కౌబాయ్, జేమ్స్ బాండ్ లాంటి కథను రాయిస్తున్నారని తెలిసింది. ఇప్పటికే వీరిద్దరూ దీనిపై మాట్లాడుకున్నారని.. హాలీవుడ్ స్టైల్లో సినిమాను తీయబోతున్నారని తెలుస్తోంది. మరీ వీరి కాంబినేషన్ ఎలా ఉంటుందన్న ఆసక్తి అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది.

First Published:  19 April 2020 11:38 PM GMT
Next Story