Telugu Global
Cinema & Entertainment

నా సినిమా థియేటర్ లోనే చూడాలి

V అనే సినిమాకు సంబంధించిన మేటర్ ఇది. ఈ సినిమాపై మొన్నటివరకు ఓ రూమర్ చెలరేగింది. లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన ఈ సినిమాను థియేటర్లలో కంటే ముందు ఓటీటీలో రిలీజ్ చేయాలని నిర్మాత దిల్ రాజు భావిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. వీటిని సదరు నిర్మాత ఖండించాడు. తమ సినిమా ముందుగా థియేటర్లలోనే వస్తుందని స్పష్టంచేశాడు. ఇప్పుడు దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ కూడా ఇదే చెబుతున్నాడు. “V సినిమాను థియేటర్ లోనే చూడాలి. థియేట్రికల్ ఎక్స్ […]

నా సినిమా థియేటర్ లోనే చూడాలి
X

V అనే సినిమాకు సంబంధించిన మేటర్ ఇది. ఈ సినిమాపై మొన్నటివరకు ఓ రూమర్ చెలరేగింది. లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన ఈ సినిమాను థియేటర్లలో కంటే ముందు ఓటీటీలో రిలీజ్ చేయాలని నిర్మాత దిల్ రాజు భావిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. వీటిని సదరు నిర్మాత ఖండించాడు. తమ సినిమా ముందుగా థియేటర్లలోనే వస్తుందని స్పష్టంచేశాడు. ఇప్పుడు దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ కూడా ఇదే చెబుతున్నాడు.

“V సినిమాను థియేటర్ లోనే చూడాలి. థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ కోసమే ఈ సినిమా తీశాను తప్ప మొబైల్స్ లో చూడడం కోసం కాదు. అవార్డ్ విన్నింగ్ టెక్నీషియన్స్ దీనికి పనిచేశారు. నాని, సుధీర్ బాబు లాంటి హీరోలు వర్క్ చేశారు. ఇలాంటి సినిమాను సిల్వర్ స్క్రీన్ పై చూస్తేనే మజా. ఆ తర్వాతే మొబైల్స్ లేదా టీవీల్లో చూడాలి. ఓటీటీకి నేను వ్యతిరేకం కాదు. కానీ నా ఫస్ట్ ప్రయారిటీ మాత్రం బిగ్ స్క్రీన్ కే.”

ఇలా V సినిమా రిలీజ్ పై ఇంద్రగంటి కూడా క్లారిటీ ఇచ్చాడు. థియేటర్ కంటే ముందే అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమాను రిలీజ్ చేయడం కోసం తనను ఎవ్వరూ సంప్రదించలేదని, ఒకవేళ తనను అడిగి ఉంటే నో చెప్పేవాడినని అంటున్నాడు ఈ దర్శకుడు.

First Published:  17 April 2020 7:30 PM GMT
Next Story