Telugu Global
Cinema & Entertainment

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్

ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి చరణ్ టీజర్ వచ్చింది. దీంతో అంతా పండగ చేసుకున్నారు. మరీ ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ ఆనందానికి అంతులేదు. ఇప్పుడు కళ్లన్నీ ఎన్టీఆర్ టీజర్ పై పడ్డాయి. చరణ్ బర్త్ డేకు ఆర్ఆర్ఆర్ టీజర్ వచ్చింది కాబట్టి, త్వరలోనే రానున్న తారక్ బర్త్ డే (మే 20)కు మరో టీజర్ వస్తుందని ఎన్టీఆర్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. వాళ్లందరి ఆశలపై నీళ్లుచల్లాడు రాజమౌళి. ఈ లాక్ డౌన్ టైమ్ లో ఎన్టీఆర్ టీజర్ ను రెడీ […]

RRR Motion Poster
X

ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి చరణ్ టీజర్ వచ్చింది. దీంతో అంతా పండగ చేసుకున్నారు. మరీ ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ ఆనందానికి అంతులేదు. ఇప్పుడు కళ్లన్నీ ఎన్టీఆర్ టీజర్ పై పడ్డాయి. చరణ్ బర్త్ డేకు ఆర్ఆర్ఆర్ టీజర్ వచ్చింది కాబట్టి, త్వరలోనే రానున్న తారక్ బర్త్ డే (మే 20)కు మరో టీజర్ వస్తుందని ఎన్టీఆర్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. వాళ్లందరి ఆశలపై నీళ్లుచల్లాడు రాజమౌళి.

ఈ లాక్ డౌన్ టైమ్ లో ఎన్టీఆర్ టీజర్ ను రెడీ చేయడం కష్టమైన పని అంటున్నాడు రాజమౌళి. ఎన్టీఆర్ పై తీసిన ఫుటేజ్ మొత్తం ఆఫీస్ సర్వర్ లో ఉందని, ఆఫీస్ కు వెళ్లే పరిస్థితి లేదని స్పష్టంచేశాడు. ఇదొక ఎత్తయితే టీజర్ కు సంబంధించి మరో బాంబు పేల్చాడు జక్కన్న.

ఎన్టీఆర్ టీజర్ కు సంబంధించి ఇంకా షూటింగ్ పెండింగ్ ఉందంట. ఆ షూట్ కంప్లీట్ అయితే తప్ప టీజర్ రెడీ అవ్వదు. ప్రస్తుతం టాలీవుడ్ మొత్తం బంద్ ఉంది. ప్రభుత్వం షూటింగ్స్ కు ఎప్పుడు అనుమతిస్తుందో కూడా తెలియదు. మే 3 తర్వాత కూడా టాలీవుడ్ లో షూటింగ్స్ అనుమానమే అంటూ వార్తలొస్తున్నాయి. దీంతో ఎన్టీఆర్ టీజర్ వస్తుందో రాదో కచ్చితంగా చెప్పలేనంటున్నాడు రాజమౌళి. ప్రభుత్వం మే 3 నుంచి షూటింగ్ కు అనుమతిస్తే మాత్రం తారక్ బర్త్ డేకు కచ్చితంగా టీజర్ రెడీ చేస్తానంటున్నాడు

First Published:  18 April 2020 6:29 AM GMT
Next Story