Telugu Global
Cinema & Entertainment

రష్మిక కూడా హోం వర్క్ స్టార్ట్ చేసింది

పుష్ప సినిమా ఇంకా సెట్స్ పైకి రాలేదు. లెక్కప్రకారం ఈపాటికే సినిమా సెట్స్ పైకి రావాలి కానీ లాక్ డౌన్ కారణంగా వాయిదాపడింది. అయితే ఈ గ్యాప్ లో యూనిట్ మాత్రం ఖాళీగా లేదు. ఎవరి పనులు వాళ్లకు అప్పగించాడు దర్శకుడు సుకుమార్. హీరోహీరోయిన్లు, మ్యూజిక్ డైరక్టర్, కాస్ట్యూమ్ డిజైనర్, ఆర్ట్ డైరక్టర్ అనే తేడా లేకుండా అందరికీ పనులు పురమాయించాడు. దేవిశ్రీప్రసాద్ తో ఇప్పటికే ఆన్ లైన్ మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభించాడు సుకుమార్. అటు బన్నీకి […]

రష్మిక కూడా హోం వర్క్ స్టార్ట్ చేసింది
X
పుష్ప సినిమా ఇంకా సెట్స్ పైకి రాలేదు. లెక్కప్రకారం ఈపాటికే సినిమా సెట్స్ పైకి రావాలి కానీ లాక్ డౌన్ కారణంగా వాయిదాపడింది. అయితే ఈ గ్యాప్ లో యూనిట్ మాత్రం ఖాళీగా లేదు. ఎవరి పనులు వాళ్లకు అప్పగించాడు దర్శకుడు సుకుమార్. హీరోహీరోయిన్లు, మ్యూజిక్ డైరక్టర్, కాస్ట్యూమ్ డిజైనర్, ఆర్ట్ డైరక్టర్ అనే తేడా లేకుండా అందరికీ పనులు పురమాయించాడు.

దేవిశ్రీప్రసాద్ తో ఇప్పటికే ఆన్ లైన్ మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభించాడు సుకుమార్. అటు బన్నీకి మేకోవర్ వర్క్ అప్పగించాడు. కాస్త ఒళ్లు చేయడంతో పాటు గడ్డం పెంచే పని అప్పగించాడు. దీంతో పాటు చిత్తూరు యాస నేర్చుకునే పని కూడా అప్పగించాడు. అటు రష్మికకు కూడా అదే పని అప్పగించాడు. ప్రస్తుతం రష్మిక.. చిత్తూరు యాస నేర్చుకునే పనిలో బిజీగా ఉంది.

నిజానికి ఈ ముద్దుగుమ్మకు చిత్తూరు యాస కొత్తకాదు. తన తొలి సినిమాలోనే అక్కడక్కడ తమిళ్ మిక్స్ చేస్తూ చిత్తూరు యాస మాట్లాడింది. అయితే ఈసారి పూర్తిస్థాయిలో చిత్తూరు యాసను మాట్లాడబోతోంది. ఈ మేరకు ఇంట్లోనే చిత్తూరు యాసలో డైలాగ్స్ బట్టీ పట్టడం స్టార్ట్ చేసింది.

First Published:  18 April 2020 6:41 AM GMT
Next Story