Telugu Global
Cinema & Entertainment

బాలీవుడ్ రీఎంట్రీకి రాంచరణ్ ప్లాన్?

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఇప్పటికే ఓ హిందీ సినిమా తీసి బాలీవుడ్ లో చేతులు కాల్చుకున్నాబు. ‘జంజీర్’ పేరుతో బాలీవుడ్ లోకి ఘనంగా ప్రవేశించాడు. ఈ చిత్రం ఫ్లాప్ కావడంతో ఇక మళ్లీ బాలీవుడ్ వైపు చూడలేదు. ఇందులో నటించిన వారికి చెడ్డపేరే వచ్చింది. ఈ ఘోరమైన ఫ్లాప్ తర్వాత బాలీవుడ్ నుంచి పిలుపు వచ్చినా రాంచరణ్ దూరంగానే ఉంటున్నాడు. ఇప్పుడు మరోసారి ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో రాంచరణ్ మళ్లీ బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. […]

బాలీవుడ్ రీఎంట్రీకి రాంచరణ్ ప్లాన్?
X

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఇప్పటికే ఓ హిందీ సినిమా తీసి బాలీవుడ్ లో చేతులు కాల్చుకున్నాబు. ‘జంజీర్’ పేరుతో బాలీవుడ్ లోకి ఘనంగా ప్రవేశించాడు. ఈ చిత్రం ఫ్లాప్ కావడంతో ఇక మళ్లీ బాలీవుడ్ వైపు చూడలేదు. ఇందులో నటించిన వారికి చెడ్డపేరే వచ్చింది.

ఈ ఘోరమైన ఫ్లాప్ తర్వాత బాలీవుడ్ నుంచి పిలుపు వచ్చినా రాంచరణ్ దూరంగానే ఉంటున్నాడు. ఇప్పుడు మరోసారి ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో రాంచరణ్ మళ్లీ బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు.

సహజంగానే రాజమౌళి చిత్రంలో నటించిన వారు దేశవ్యాప్తంగా స్టార్ లు అయిపోతారు. ప్యాన్ ఇండియా స్టార్ లు అవుతారు. ఇప్పటికే ప్రభాస్ ‘బాహుబలి’ సినిమాతో ఓవర్ నైట్ ప్యాన్ ఇండియా హీరో అయ్యాడు. ఇప్పుడు అదే బాటలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో రాంచరణ్ సైతం బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు..

అయితే ఇప్పటికిప్పుడు బాలీవుడ్ లో సినిమాలు చేసే సాహసం రాంచరణ్ చేయడం లేదట.. ‘ఆర్ఆర్ఆర్’ ఫలితం చూశాక.. జనాల స్పందన చూసి బాలీవుడ్ లోకి కూడా వెళ్లాలని ఆలోచిస్తున్నాడట..

అయితే ఎన్టీఆర్ సైతం ఆర్ఆర్ఆర్ తర్వాత బాలీవుడ్ లోకి తన సినిమాలను రిలీజ్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడట.. మంచి ఆఫర్లు వస్తే బాలీవుడ్ లోనూ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అవుతున్నాడని సమాచారం.

First Published:  18 April 2020 3:52 AM GMT
Next Story