Telugu Global
Cinema & Entertainment

మహేష్-రాజమౌళి సినిమా ఫిక్స్

నిజానికి వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా బ్రేకింగ్ న్యూస్ కాదు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై మహేష్ బాబు హీరోగా, రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. దాదాపు ఆరేళ్లుగా నలుగుతున్న ఈ ప్రాజెక్టు ఎట్టకేలకు ఫైనల్ అయింది. ఆర్ఆర్ఆర్ తర్వాత మహేష్ బాబుతోనే తన సినిమా ఉంటుందని రాజమౌళి స్పష్టంచేశాడు. “నారాయణ, దానయ్య అడ్వాన్సులు నా దగ్గర చాన్నాళ్లుగా ఉన్నాయి. బాహుబలి తర్వాత వాళ్లకే సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాను. ఇందులో భాగంగా దానయ్యతో ఆర్ఆర్అర్ […]

మహేష్-రాజమౌళి సినిమా ఫిక్స్
X

నిజానికి వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా బ్రేకింగ్ న్యూస్ కాదు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై మహేష్ బాబు హీరోగా, రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. దాదాపు ఆరేళ్లుగా నలుగుతున్న ఈ ప్రాజెక్టు ఎట్టకేలకు ఫైనల్ అయింది. ఆర్ఆర్ఆర్ తర్వాత మహేష్ బాబుతోనే తన సినిమా ఉంటుందని రాజమౌళి స్పష్టంచేశాడు.

“నారాయణ, దానయ్య అడ్వాన్సులు నా దగ్గర చాన్నాళ్లుగా ఉన్నాయి. బాహుబలి తర్వాత వాళ్లకే సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాను. ఇందులో భాగంగా దానయ్యతో ఆర్ఆర్అర్ చేస్తున్నాను. నెక్ట్స్ చేయబోయే సినిమా నారాయణదే. దుర్గాఆర్ట్స్ బ్యానర్ పై మహేష్ బాబు హీరోగా ఆ సినిమా వస్తుంది”

ఇలా మహేష్ బాబుతో సినిమా ఉంటుందని ప్రకటించాడు రాజమౌళి. అంతేకాదు.. ఈ సినిమాకు సంబంధించి కథ రెడీ చేసే ప్రాసెస్ ఆల్రెడీ మొదలైనట్టు ప్రకటించాడు. ప్రస్తుతం తను ఇంట్లోనే ఉన్నానని, తన తండ్రి విజయేంద్రప్రసాద్ మాత్రం ఆఫీస్ లోనే ఉండిపోయారని, అన్నయ్య రాజమండ్రిలో లాక్ అయిపోయాడని.. అయినప్పటికీ ముగ్గురం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్టోరీ డిస్కషన్స్ చేస్తున్నామని తెలిపాడు. 2-3 ఐడియాలు రెడీ అయిన తర్వాత మహేష్ ను కలవబోతున్నాడు జక్కన్న.

First Published:  18 April 2020 5:26 AM GMT
Next Story