Telugu Global
National

"మల్లెపూల సువాసన, పచ్చ చీరకు పదవి" " ఏపీ బీజేపీపై మాధవీలత ఫైర్

బీజేపీనాయకురాలు, నటి మాధవీలత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టారు. ఒకప్పుడు టీడీపీలో ఉంటూ బీజేపీని, మోడీని బూతులు తిట్టిన పచ్చ చీరకే ఇప్పుడు అధికార ప్రతినిధి పదవి ఇచ్చారంటూ ఆమె విమర్శించారు. పచ్చ చీరకు పదవి అంటగట్టింది ఎవరు అని ప్రశ్నించారు. ఆమె చేసిన వ్యాఖ్యలను యథాతథంగా చూస్తే… ”మై ఆఫీసియల్ స్టేట్‌మెంట్‌….My Official Statement పచ్చ కండువాలు కప్పుకున్నంత […]

మల్లెపూల సువాసన, పచ్చ చీరకు పదవి  ఏపీ బీజేపీపై మాధవీలత ఫైర్
X

బీజేపీనాయకురాలు, నటి మాధవీలత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టారు. ఒకప్పుడు టీడీపీలో ఉంటూ బీజేపీని, మోడీని బూతులు తిట్టిన పచ్చ చీరకే ఇప్పుడు అధికార ప్రతినిధి పదవి ఇచ్చారంటూ ఆమె విమర్శించారు. పచ్చ చీరకు పదవి అంటగట్టింది ఎవరు అని ప్రశ్నించారు.

ఆమె చేసిన వ్యాఖ్యలను యథాతథంగా చూస్తే…

”మై ఆఫీసియల్ స్టేట్‌మెంట్‌….My Official Statement

పచ్చ కండువాలు కప్పుకున్నంత కాలం బిజెపి ని అమ్మ నా బూతులు తిట్టి, ప్రధానిని తిట్టి , అధ్యక్షుడిని తిట్టి ఇపుడు అధికారంలో లేని కారణంగా దేశంలో అధికారంలోకి వచ్చిన పార్టీ కనుక ఇపుడు అందరికి ఇదే దొరికిందే సందుగా కాషాయం కప్పుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో ఇంకా రాష్ట్ర కమిటీ ఏర్పాటు అవ్వలేదు, మరి కొత్తగా వచ్చిన పచ్చ చీరకి కాషాయం అధికార ప్రతినిధి అంటగట్టింది ఎవరు ?? ( may be unofficial but official ).

పార్టీ కోసం పని చేసిన వాళ్ళకి విలువ ఇవ్వరు. పచ్చ కండువా కప్పుకుని మల్లెపూల వాసన సువాసన గురించి మాట్లాడిన వాళ్ళు అధికార ప్రతినిధులుగా ఏం చేసారని ఇచ్చారు? మల్లెల మరపు మెరుపు నలిపిన కథలు చెప్పారు కనుక?? లేదా అధికారం లో ఉన్నపుడు అదుపు తప్పి మాట్లాడారనా? పార్టీని పనికిమాలిన తిట్లు తిడితేనే అధికారం ఇస్తారని నాకు తెలిసి ఉంటే నేను కూడా పక్క పార్టీ కండువా మార్చుకునేదాన్ని.

మా సినిమాలోనే అనుకున్న పక్క బాషా వాళ్ళని తెచుకుంటారని. ఔనులే పక్క పార్టీ నుండి వచ్చి కండువా కప్పుకున్నవారు అధికారం ఇవ్వకపోతే మళ్ళీ ఇంకో పార్టీలోకి మారిపోతారు కదా !. అందుకేనేమో ఆంధ్రలో పార్టీ స్థాయి గతితప్పుతుంది. పచ్చ కండువాలు కప్పుకుని వచ్చిన వారికే ఇక్కడ విలువ, గౌరవం. కష్టపడి పనిచేసేవాళ్ళకి గౌరవాలు ఉండవు. ఇది నిజం ఇదే నిజం ఎవరు ఖండించినా సరే. నిజాన్ని దైర్యంగా చెప్పే దమ్ము నాకుంది . ఎవరు అడ్డొచ్చినా ఎదుర్కొనే సత్తా ఉంది .

సాహో జజయో రాజకీయం …..
బాబులు అమ్మలూ తిట్టండయ్యా బాగా తిట్టండి.
తర్వాత వచ్చి కాషాయం కప్పుకోండి పదవులు ఇస్తారు.
ఇది నిజం.
కాలింది అనుకోండి కడుపు మంట అనుకోండి.
కానీ ఇదే నిజం.

Its not Complaint its my Commitment towards party ,, i speak facts what ever the circumstances ,,,,,, r the consequences,,,,” అంటూ మాధవీలత విమర్శించారు.

ఈ పోస్టులో మాధవీలత నేరుగా సదరు పచ్చ చీర నాయకురాలు పేరు వెల్లడించలేకపోయినా ప్రజలు గుర్తించేలా కొన్ని సంకేతాలు ఇచ్చారు. మల్లెపూల వాసన వంటి పదాలు వాడడం ద్వారా టీడీపీ నుంచి బీజేపీలోకి వచ్చి పదవులు తీసుకున్న మహిళా నేత ఎవరు అన్న దానిపై పరోక్షంగా స్పష్టత ఇచ్చారు మాధవీలత.

My Official Statement పచ్చ కండువాలు కప్పుకున్నంత కాలం బిజెపి ని అమ్మ నా బూతులు తిట్టి ప్రధాని ని తిట్టి ,…

Publiée par Actress Maadhavi sur Vendredi 17 avril 2020

First Published:  17 April 2020 10:40 PM GMT
Next Story