Telugu Global
Cinema & Entertainment

పరశురామ్ స్థానంలో విక్రమ్ కుమార్

అన్నీ అనుకున్నట్టు జరిగితే నాగచైతన్య, పరశురాం కలిసి సెట్స్ పైకి వెళ్లాలి. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై ఆ సినిమా రావాలి. కానీ అనుకోకుండా మహేష్ బాబు ఎంటర్ అవ్వడంతో ప్రాజెక్టు ఆగిపోయింది. పరశురామ్ అటు షిఫ్ట్ అయ్యాడు. దీంతో పరశురామ్ కు ఇవ్వాల్సిన అవకాశాన్ని విక్రమ్ కుమార్ కు ఇచ్చాడు నాగచైతన్య. అవును.. విక్రమ్ కుమార్-నాగచైతన్య కాంబోలో సినిమా సెట్ అయింది. ఇంతకుముందు వీళ్లిద్దరూ కలిసి మనం సినిమా చేశారు. ఇప్పుడు కేవలం నాగచైతన్య […]

పరశురామ్ స్థానంలో విక్రమ్ కుమార్
X

అన్నీ అనుకున్నట్టు జరిగితే నాగచైతన్య, పరశురాం కలిసి సెట్స్ పైకి వెళ్లాలి. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై ఆ సినిమా రావాలి. కానీ అనుకోకుండా మహేష్ బాబు ఎంటర్ అవ్వడంతో ప్రాజెక్టు ఆగిపోయింది. పరశురామ్ అటు షిఫ్ట్ అయ్యాడు. దీంతో పరశురామ్ కు ఇవ్వాల్సిన అవకాశాన్ని విక్రమ్ కుమార్ కు ఇచ్చాడు నాగచైతన్య.

అవును.. విక్రమ్ కుమార్-నాగచైతన్య కాంబోలో సినిమా సెట్ అయింది. ఇంతకుముందు వీళ్లిద్దరూ కలిసి మనం సినిమా చేశారు. ఇప్పుడు కేవలం నాగచైతన్య హీరోగా మూవీ సెట్ చేశాడు విక్రమ్ కుమార్. అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మాతగా వీళ్లిద్దరి కాంబినేషన్ సెట్స్ పైకి రాబోతోంది.

ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరి అనే సినిమా చేస్తున్నాడు చైతూ. లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షెడ్యూల్ ఆగింది. పైగా అది లాస్ట్ షెడ్యూల్. అది కంప్లీట్ అయిన వెంటనే విక్రమ్ కుమార్ సినిమా స్టార్ట్ చేస్తాడు. కొసమెరుపు ఏంటంటే.. విక్రమ్ కుమార్ సినిమాకు ప్రీ-ప్రొడక్షన్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు. స్టోరీ బోర్డ్ తో సహా.. స్క్రీన్ ప్లేతో కథ రెడీగా ఉంది. సెట్స్ పైకి వెళ్లడమే ఆలస్యం.

First Published:  18 April 2020 6:45 AM GMT
Next Story