Telugu Global
NEWS

2 రోజుల్లో 116 కేసులు... రెడ్‌ జోన్‌లో సూర్యాపేట

తెలంగాణలో కరోనా కేసులు పెరిగాయి. శుక్రవారం ఒక్కరోజే కొత్తగా మరో 66 కేసులు నమోదు అయ్యాయి. రెండు రోజుల్లో 116 కేసులు బయటపడడం ఆందోళన కల్గిస్తోంది. తాజాగా నమోదైన 66 కేసుల్లో 30 కేసులు గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనివి. సూర్యాపేట జిల్లాలో 15 కేసులు, ఆదిలాబాద్‌లో మూడు, జోగులాంబ గద్వాల, మంచిర్యాల జిల్లాలో ఒక్కో కేసు నమోదైంది. తాజాగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 766కి చేరింది. ఇప్పటివరకూ 186 మంది బాధితులు కోలుకున్నారు. 18 […]

2 రోజుల్లో 116 కేసులు... రెడ్‌ జోన్‌లో సూర్యాపేట
X

తెలంగాణలో కరోనా కేసులు పెరిగాయి. శుక్రవారం ఒక్కరోజే కొత్తగా మరో 66 కేసులు నమోదు అయ్యాయి. రెండు రోజుల్లో 116 కేసులు బయటపడడం ఆందోళన కల్గిస్తోంది. తాజాగా నమోదైన 66 కేసుల్లో 30 కేసులు గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనివి. సూర్యాపేట జిల్లాలో 15 కేసులు, ఆదిలాబాద్‌లో మూడు, జోగులాంబ గద్వాల, మంచిర్యాల జిల్లాలో ఒక్కో కేసు నమోదైంది.

తాజాగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 766కి చేరింది. ఇప్పటివరకూ 186 మంది బాధితులు కోలుకున్నారు. 18 మంది మృతి చెందారు. 562 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ తర్వాత నిజామాబాద్‌లోనే ఎక్కువ కేసులు బయటపడ్డాయి. అక్కడ ఇక్కడ యాక్టివ్‌ కేసులు 42 ఉన్నాయి. సూర్యాపేటలో మొత్తం 44 కేసులు నమోదు అయ్యాయి.

ఇటు విదేశాలతో పోలిస్తే భారత్‌లో కరోనా వ్యాప్తి తక్కువగానే ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. 24 మందికి పరీక్షలు చేస్తే ఒక్కరికి పాజిటివ్‌ వస్తోందని వెల్లడించింది. దేశంలో ఇప్పటివరకు 13,387 కేసులు నమోదయ్యాయని… గడిచిన 24 గంటల్లో 1007 కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్‌ సెక్రటరీ లవ్‌అగర్వాల్‌ తెలిపారు. వీలైనంత త్వరలో కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ను కనుక్కోవడానికి భారత్‌కు చెందిన 4 పరిశోధన సంస్థలు విదేశీ ల్యాబ్‌లతో కలిసి పనిచేస్తునట్టు వెల్లడించారు. రాష్ట్రాలకు ఇప్పటివరకు 5 లక్షల ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్‌లను పంపిణీ చేసినట్టు తెలిపారు లవ్‌ అగర్వాల్‌.

మే వరకు 10 లక్షల ర్యాపిడ్‌ కిట్లను స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేస్తామని వెల్లడించారు లవ్‌అగర్వాల్‌. PPE లతో పాటు వెంటిలెటర్లను కూడా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేస్తునట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా 1919 కోవిడ్‌ స్పెషల్‌ ఆస్పత్రులను ప్రారంభిస్తునట్టు వెల్లడించారు. కోవిడ్‌ ఆస్పత్రులు పనిచేసే విధానాన్ని వివరించారు వైద్యులు. కరోనా ఆస్పత్రుల్లో ట్రీట్‌మెంట్‌ చేస్తున్న వైద్యులతో వీడియో కాన్ఫరెన్స్‌ కూడా నిర్వహించినట్లు చెప్పారు.

First Published:  17 April 2020 8:50 PM GMT
Next Story