Telugu Global
NEWS

కర్నూలు కలెక్టర్‌పై రగులుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు

అత్యధిక కరోనా కేసులు నమోదైన జిల్లాగా ఏపీలో కర్నూలు జిల్లా రెండో స్థానంలో ఉంది. ఇక్కడ పాజిటివ్ కేసులు వంద దాటి పోయాయి. ఈ సమయంలోనే జిల్లా కలెక్టర్‌కు, వైసీపీ ఎమ్మెల్యేలకు మధ్య కోల్డ్ వార్ మొదలైంది. కలెక్టర్‌పై వైసీపీ ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్‌ అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యేలు ఒక ఆంగ్ల పత్రిక వద్ద ఆరోపించారు. కర్నూలు జిల్లాలో పరిస్థితిని సరిదిద్దేందుకు ఒక డైనమిక్ కలెక్టర్‌ను నియమించాల్సిందిగా ముఖ్యమంత్రిని కోరుతామని […]

కర్నూలు కలెక్టర్‌పై రగులుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు
X

అత్యధిక కరోనా కేసులు నమోదైన జిల్లాగా ఏపీలో కర్నూలు జిల్లా రెండో స్థానంలో ఉంది. ఇక్కడ పాజిటివ్ కేసులు వంద దాటి పోయాయి. ఈ సమయంలోనే జిల్లా కలెక్టర్‌కు, వైసీపీ ఎమ్మెల్యేలకు మధ్య కోల్డ్ వార్ మొదలైంది. కలెక్టర్‌పై వైసీపీ ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్‌ అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యేలు ఒక ఆంగ్ల పత్రిక వద్ద ఆరోపించారు.

కర్నూలు జిల్లాలో పరిస్థితిని సరిదిద్దేందుకు ఒక డైనమిక్ కలెక్టర్‌ను నియమించాల్సిందిగా ముఖ్యమంత్రిని కోరుతామని వైసీపీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. కలెక్టర్ వీరపాండియన్‌ అత్యంత నిర్లక్ష్యంగా, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. కరోనా నేపథ్యంలో అత్యవసర పనిపై తాము కాల్ చేసినా కలెక్టర్ ఫోన్ తీయడం లేదని వైసీపీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు.

పేరుకే తాము అధికార పార్టీ ఎమ్మెల్యేలమని… కానీ ఎక్కడా కూడా ప్రజాప్రతినిధుల నుంచి సలహాలు కూడా స్వీకరించకుండా కలెక్టర్ తనకు తోచింది చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యేలు వ్యాఖ్యానిస్తున్నారు. అసలు జిల్లాలో పరిస్థితిని చక్కదిద్దేందుకు కలెక్టర్ వద్ద ఎలాంటి ప్రణాళిక లేదని… కేవలం కలెక్టర్ వీడియో కాన్పరెన్స్‌ల ద్వారానే గడుపుతున్నారు కానీ… ఎక్కడా పరిస్థితిని స్వయంగా పరిశీలించడం లేదని వైసీపీ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు.

కరోనా కేసులు ఎక్కువగా నమోదైన ఒక నియోజకవర్గం ఎమ్మెల్యే… కలెక్టర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కలెక్టర్‌ వ్యవహారంపై సీఎం దగ్గరే తేల్చుకుంటామని మరో ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. ఆయన స్థానంలో మరో డైనమిక్ కలెక్టర్‌ను నియమించాల్సిందిగా కోరుతామన్నారు. తాము పూర్తిగా డమ్మీలుగా మారిపోయామని… అధికార పార్టీకి చెంది కూడా కనీసం ఒక రేషన్ కార్డు కూడా ఇప్పించుకోలేని దుస్థితిలో ఉన్నామని… అంతా అధికారులు చెప్పినట్టే జరగాలన్నట్టుగా పరిస్థితి ఉందని మరో ఎమ్మెల్యే వాపోయారు.

First Published:  16 April 2020 10:56 PM GMT
Next Story