Telugu Global
Cinema & Entertainment

పవన్ కళ్యాణ్ సినిమాలపై నాగబాబు హాట్ కామెంట్స్

పవన్ కళ్యాణ్ సినిమాలపై ఆయన సోదరుడు, జనసేన నాయకుడు నాగబాబు తాజాగా ఓ సంచలన విషయాన్ని వెల్లడించారు. పవన్ కళ్యాణ్ సినిమాల గురించి సుధీర్ఘంగా అభిమానులతో పలు విషయాలను పంచుకున్నాడు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో ‘వకీల్ సాబ్ ’ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత ‘క్రిష్ ’ దర్శకత్వంలో సినిమా మొదలైంది. దీనికి ఏఎం రత్నం నిర్మాత. అయితే ఈ సినిమాపై ఒక్క విషయాన్ని కూడా దర్శకుడు క్రిష్, నిర్మాత ఏఏం రత్నం […]

పవన్ కళ్యాణ్ సినిమాలపై నాగబాబు హాట్ కామెంట్స్
X

పవన్ కళ్యాణ్ సినిమాలపై ఆయన సోదరుడు, జనసేన నాయకుడు నాగబాబు తాజాగా ఓ సంచలన విషయాన్ని వెల్లడించారు. పవన్ కళ్యాణ్ సినిమాల గురించి సుధీర్ఘంగా అభిమానులతో పలు విషయాలను పంచుకున్నాడు.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో ‘వకీల్ సాబ్ ’ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత ‘క్రిష్ ’ దర్శకత్వంలో సినిమా మొదలైంది. దీనికి ఏఎం రత్నం నిర్మాత. అయితే ఈ సినిమాపై ఒక్క విషయాన్ని కూడా దర్శకుడు క్రిష్, నిర్మాత ఏఏం రత్నం బయటపెట్టడం లేదు. దీనిపై తాజాగా నాగబాబు సంచలన విషయాలు వెల్లడించాడు.

క్రిష్ దర్శకత్వంలో వస్తున్న చిత్రానికి ‘విరూపాక్ష’ అనే టైటిల్ అనుకుంటున్నారని నాగబాబు లీక్ చేశాడు. అంతేకాదు.. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఔరంగజేబ్ కాలంలో దొంగ పాత్రలో నటిస్తున్నట్టు సంచలన విషయాన్ని బయటపెట్టాడు.

అయితే క్రిష్ , నిర్మాత ఏఎం రత్నం.. ఎంతో గుట్టుగా సినిమా కథ, కథనాలు రివీల్ చేయకుండా దాచేస్తే ఆ విషయాన్ని తాజాగా నాగబాబు రివీల్ చేయడం సంచలనంగా మారింది. దీనిపై క్రిష్, ఏఎం రత్నం సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. కీలక విషయాన్ని ఎలా లీక్ చేస్తారని వారు ఆగ్రహంగా ఉన్నారట.

First Published:  17 April 2020 5:35 AM GMT
Next Story