Telugu Global
Cinema & Entertainment

‘ఆచార్య’లో చిరంజీవి, మోహన్ బాబు... నిజమేనా?

‘ఆచార్య’.. చిరంజీవి హీరోగా.. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీపై బోలెడు అంచనాలున్నాయి. కొన్ని నెలల క్రితమే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితోపాటు మోహన్ బాబు నటిస్తున్నాడని వార్తలు వచ్చాయి. ఈ వార్త సినీ అభిమానులను ఉత్సాహపరిచింది. అయితే ఆ వార్తల గురించి తరువాత ఎటువంటి లీక్స్ రాలేదు. చిరంజీవి, మోహన్ బాబులు కెరీర్ ఆరంభంలో కలిసి పనిచేశారు. తరువాత వారి మధ్య కొంత వైరం నెలకొంది. కానీ ఇప్పుడు అంతా చల్లబడింది. […]

‘ఆచార్య’లో చిరంజీవి, మోహన్ బాబు... నిజమేనా?
X

‘ఆచార్య’.. చిరంజీవి హీరోగా.. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీపై బోలెడు అంచనాలున్నాయి. కొన్ని నెలల క్రితమే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితోపాటు మోహన్ బాబు నటిస్తున్నాడని వార్తలు వచ్చాయి. ఈ వార్త సినీ అభిమానులను ఉత్సాహపరిచింది. అయితే ఆ వార్తల గురించి తరువాత ఎటువంటి లీక్స్ రాలేదు.

చిరంజీవి, మోహన్ బాబులు కెరీర్ ఆరంభంలో కలిసి పనిచేశారు. తరువాత వారి మధ్య కొంత వైరం నెలకొంది. కానీ ఇప్పుడు అంతా చల్లబడింది. మొన్నీ మధ్య మూవీ ఆర్టిస్ట్ సమావేశంలో మంచి స్నేహితులుగా మారిపోయారు.

అయితే ఆచార్యలో కామిక్ విలన్ పాత్ర కోసం మోహన్ బాబును కొరటాల, చిరంజీవి సంప్రదించినట్టు తెలిసింది. అయితే మోహన్ బాబు మాత్రం పూర్తి నెగెటివ్ రోల్ విలన్ అయితేనే చేస్తానని చెప్పాడట. దీంతో మోహన్ బాబు కోసం ఈ పాత్రలో మార్పులు చేయమని మెగాస్టార్ చిరంజీవి… దర్శకుడు కొరటాల శివపై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం.

ప్రస్తుతం లాక్ డౌన్ వేల కొరటాల ఏకంగా కథలో మోహన్ బాబు కోసం మార్పులు చేస్తున్నట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

First Published:  17 April 2020 5:25 AM GMT
Next Story