Telugu Global
NEWS

కరోనా పై పోరాటం.... సైలెంట్‌గా పని చేసుకొని పోతున్న వైఎస్ జగన్

కరోనాపై పోరాటంలో దేశంలోనే ఏపీ 5వ స్థానంలో ఉందని.. వైఎస్ జగన్ ప్రభుత్వం కరోనా కట్టడికి అమలు చేస్తున్న చర్యలు భేషుగ్గా ఉన్నాయని ఒక అధ్యయనంలో తేలింది. గత కొన్ని రోజులుగా ప్రతిపక్షాలు వైఎస్ జగన్‌పై పలు విమర్శలు చేశాయి. పక్క రాష్ట్ర సీఎం అయిన కేసీఆర్‌ను ఫాలో అవుతున్నారని.. అక్కడ ఆయన ఏం చేస్తే ఇక్కడ అది అమలు చేస్తున్నారని.. అనుభవ లేమితో జగన్ పరిపాలన సరిగ్గా చేయలేకపోతున్నారని తప్పుడు వార్తలు ప్రచారంలో పెట్టారు. కాని […]

కరోనా పై పోరాటం.... సైలెంట్‌గా పని చేసుకొని పోతున్న వైఎస్ జగన్
X

కరోనాపై పోరాటంలో దేశంలోనే ఏపీ 5వ స్థానంలో ఉందని.. వైఎస్ జగన్ ప్రభుత్వం కరోనా కట్టడికి అమలు చేస్తున్న చర్యలు భేషుగ్గా ఉన్నాయని ఒక అధ్యయనంలో తేలింది. గత కొన్ని రోజులుగా ప్రతిపక్షాలు వైఎస్ జగన్‌పై పలు విమర్శలు చేశాయి. పక్క రాష్ట్ర సీఎం అయిన కేసీఆర్‌ను ఫాలో అవుతున్నారని.. అక్కడ ఆయన ఏం చేస్తే ఇక్కడ అది అమలు చేస్తున్నారని.. అనుభవ లేమితో జగన్ పరిపాలన సరిగ్గా చేయలేకపోతున్నారని తప్పుడు వార్తలు ప్రచారంలో పెట్టారు. కాని సీఎం జగన్ మాత్రం తన పని తాను చేసుకొని పోతున్నారు. ప్రచారం కంటే కరోనా కట్టడే ముఖ్యంగా భావించిన జగన్ ఆ దిశగా సాగిపోతున్నారు.

మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో లాక్‌డౌన్ నిబంధనలు అత్యంత కఠినంగా అమలవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రమంతా మూడు పర్యాయాలు సర్వే చేసి అందరి హెల్త్ ప్రొఫైల్స్ సేకరించారు. ఇప్పటి వరకు ఏ రాష్ట్రం కూడా పూర్తి సర్వే చేయలేదు. మరోవైపు మర్కజ్ వెళ్ళి వచ్చినవారి విషయంలో క్షేత్ర స్థాయి నుంచి సమాచారం సేకరించి అన్ని రాష్ట్రాల కంటే ముందుగానే వారందరినీ క్వారంటైన్‌కు తరలించారు.

ఇక ఇప్పుడు సర్వే చేసిన వివరాల ఆధారంగా అవసరమైన వారికి కరోనా పరీక్షలు చేయాలని నిర్థారించారు. ఇందుకు గాను దక్షిణ కొరియా నుంచి ర్యాపిడ్ కిట్లను ఏపీ ప్రభుత్వం దిగుమతి చేసుకుంది. ప్రత్యేక చార్టెడ్ ఫ్లైట్‌లో లక్ష కిట్లు ఏపీకి చేరుకున్నాయి. అనుమానితులకు ఈ కిట్ల ద్వారా నిర్థారణ పరీక్షలు చేస్తారు. కేవలం 10 నిమిషాల్లోనే వ్యాది ఉందో లేదో తెలిసిపోతుంది. ఒక వేళ నిర్థారణ అయితే ఆ రోగిని వెంటనే ఐసోలేషన్ వార్డుకు తరలించి అవసరమైన చికిత్స చేస్తారు. ఇవన్నీ వైఎస్ జగన్ దిశానిర్థేశనంతోనే జరుగుతున్నాయి.

మరోవైపు కరోనా బాధితులు పెరిగితే జనరల్, జిల్లా ఆసుపత్రుల్లో అవసరమైన వైద్యులు అవసరం. ఇప్పటికీ వైద్యుల కొరత ఉండటంతో.. శుక్రవారం జగన్ ప్రభుత్వం వైద్యుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో… 1,184 మంది వైద్యులను తక్షణమే కాంట్రాక్టు పద్దతిన నియమించుకోవడానికి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. అనుమానం వచ్చిన ప్రతీ ఒక్కరికీ ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించి తక్షణమే వైద్యం కూడా అందించాలనే ఏపీ ప్రభుత్వం ఈ చర్యలన్నీ వేగవంతంగా చేస్తోంది.

కాగా, వైఎస్ జగన్ ప్రభుత్వం సైలెంట్‌గా తమ పని చేసుకుంటూ కరోనా కట్టడికి అన్ని రకాలుగా సిద్దంగా ఉన్నా.. ప్రతిపక్షాలు మాత్రం ఇంగ్లీషు మీడియంపై కోర్టు వ్యాఖ్యలు, రాజధాని తరలింపు అనే అసందర్భ విషయాలను పట్టుకొని విమర్శలు గుప్పిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం కరోనాపై చేస్తున్న పోరాటాన్ని ప్రజలు గుర్తించకుండా ఉండటానికే ఇలా ప్రతిపక్ష పార్టీ రోజుకో వివాదాన్ని తెరపైకి తెస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

First Published:  17 April 2020 5:00 AM GMT
Next Story