Telugu Global
NEWS

1.2 లక్షల కోట్లు విడుదల చేశాం... రాష్ట్రాలకు అదనంగా 60 శాతం WMA నిధులు

కరోనా వల్ల అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిన్నా భారత్‌పై ప్రభావం అంతగా లేదని వివరించారు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్. కరోనా నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన దాస్.. జీ-20 దేశాల్లో భారత్ వృద్ధి రేటు మాత్రమే ఆశాజనకంగా ఉందన్నారు. 1930 నాటి ఆర్ధిక సంక్షోభాన్ని ప్రపంచం ఇప్పుడు చూస్తోందన్నారు. సంక్షోభ సమయంలోనూ పలు రాష్ట్రాలు మెరుగ్గా పనిచేస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు. కరోనా వల్ల ఇతర దేశాల […]

1.2 లక్షల కోట్లు విడుదల చేశాం... రాష్ట్రాలకు అదనంగా 60 శాతం WMA నిధులు
X

కరోనా వల్ల అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిన్నా భారత్‌పై ప్రభావం అంతగా లేదని వివరించారు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్. కరోనా నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన దాస్.. జీ-20 దేశాల్లో భారత్ వృద్ధి రేటు మాత్రమే ఆశాజనకంగా ఉందన్నారు.

1930 నాటి ఆర్ధిక సంక్షోభాన్ని ప్రపంచం ఇప్పుడు చూస్తోందన్నారు. సంక్షోభ సమయంలోనూ పలు రాష్ట్రాలు మెరుగ్గా పనిచేస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు.

కరోనా వల్ల ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నా భారత్‌పై మాత్రం ప్రభావం అంతగా లేదన్నారు. కరోనాను ఎదుర్కోవడంలో లాక్‌డౌన్ దేశానికి కలిసివచ్చిందన్నారు. కష్టాల్లో కూడా దేశం 2020లో 1.9 శాతం వృద్ధిరేటును సాధిస్తుందని చెప్పారు. 2021-22 నాటికి వృద్ది రేటు 7.4 శాతంగా ఉండొచ్చని వివరించారు. లాక్ డౌన్ వల్ల విద్యుత్ వినియోగం కూడా బాగా తగ్గిపోయిందన్నారు. ప్రస్తుతం దేశంలో బ్యాంకుల వద్ద కావాల్సినంత నగదు నిల్వలు ఉన్నాయని వివరించారు.

ఆటో మొబైల్‌ రంగం తీవ్ర నష్టాలను చవిచూస్తోందని శక్తికాంత వివరించారు. తయారీ రంగం నాలుగు నెలల కనిష్టానికి పడిపోయిందన్నారు.

దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావాన్ని ఆర్‌బీఐ ఎప్పటికప్పుడు అంచనా వేస్తోందని… సమీక్షిస్తోందని చెప్పారు. ఆర్ధిక పరంగా ఇబ్బందులు ఎదురుకాకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

ప్రస్తుత పరిస్థితుల్లో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు శక్తికాంత వివరించారు. 1. సమాజంలో కావాల్సినంత నగదు లభ్యత ఉండేలా చూడడం, .2. అవసరం మేరకు వ్యక్తులకు, సంస్థలకు రుణాలు ఇవ్వడం, 3. ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి తగ్గించడం, 4. మార్కెట్ వ్యవస్థను తిరిగి గాడిన పెట్టడం, 5. దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం లేకుండా చూడడం వంటి చర్యలు తీసుకుంటామని వివరించారు.

రుణాల మంజూరులో ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. దేశంలో ప్రస్తుతం 91 శాతం ఏటీఎంలు పనిచేస్తున్నాయని వివరించారు. లాక్‌డౌన్ ప్రకటించిన తర్వాత లక్షా 20వేల కోట్ల రూపాయలను విడుదల చేశామని చెప్పారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు 50వేలు కోట్లు, నాబార్డుకు 25వేల కోట్లు ఇచ్చామన్నారు. నేషనల్ హౌసింగ్ కార్పొరేషన్‌కు రూ. 10వేల కోట్లు అందిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రాలకు WMA నిధులు 60 శాతం అదనంగా ఇస్తున్నట్టు ప్రకటించారు. ఈ వేస్ అండ్ మీన్స్ అదనపు నిధులు సెప్టెంబర్‌ వరకు రాష్ట్రాలకు ఇస్తామని వివరించారు.

రివర్స్ రెపో రేటును 25 బేస్ పాయింట్లు తగ్గించినట్టు చెప్పారు. రివర్స్‌ రెపో రేటు 4 శాతం నుంచి 3.45కు తగ్గిస్తున్నట్టు చెప్పారు. జీడీపీలో 3.2 శాతం నగదును అందుబాటులోకి తెచ్చినట్టు చెప్పారు. ప్రస్తుతం పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ఆర్‌బీఐ సిద్ధంగా ఉందని దాస్ ప్రకటించారు.

కరోనాపై పోరాడుతున్న వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. మానవాళి ప్రస్తుతం అతిపెద్ద మహమ్మారితో పోరాటం చేస్తోందన్నారు.

First Published:  17 April 2020 12:08 AM GMT
Next Story