Telugu Global
Cinema & Entertainment

మహేష్ నుంచి ఒకేసారి బ్రేకింగ్ న్యూస్ లు

సరిలేరు నీకెవ్వరు సినిమా రిలీజ్ తర్వాత పూర్తిగా స్తబ్దుగా మారిపోయాడు మహేష్. కొత్త సినిమా స్టార్ట్ చేయకపోయినా ఫర్వాలేదు, కనీసం ఆ సినిమా ఏంటనే విషయాన్ని కూడా బయటకు చెప్పలేదు. అలా కెరీర్ లో మరోసారి గ్యాప్ చూస్తున్న మహేశ్.. ఈసారి ఫ్యాన్స్ కోసం పెద్ద సర్ ప్రైజ్ రెడీ చేశాడు. అవును.. తన సినిమాకు సంబంధించి అప్ డేట్స్ ను ఒకేసారి రివీల్ చేయాలని నిర్ణయించాడు. పరశురాం దర్శకత్వంలో మహేష్ ఓ సినిమా చేయబోతున్నాడనేది ఫిక్స్. […]

మహేష్ నుంచి ఒకేసారి బ్రేకింగ్ న్యూస్ లు
X

సరిలేరు నీకెవ్వరు సినిమా రిలీజ్ తర్వాత పూర్తిగా స్తబ్దుగా మారిపోయాడు మహేష్. కొత్త సినిమా స్టార్ట్ చేయకపోయినా ఫర్వాలేదు, కనీసం ఆ సినిమా ఏంటనే విషయాన్ని కూడా బయటకు చెప్పలేదు. అలా కెరీర్ లో మరోసారి గ్యాప్ చూస్తున్న మహేశ్.. ఈసారి ఫ్యాన్స్ కోసం పెద్ద సర్ ప్రైజ్ రెడీ చేశాడు. అవును.. తన సినిమాకు సంబంధించి అప్ డేట్స్ ను ఒకేసారి రివీల్ చేయాలని నిర్ణయించాడు.

పరశురాం దర్శకత్వంలో మహేష్ ఓ సినిమా చేయబోతున్నాడనేది ఫిక్స్. ఈ మేరకు ఫైనల్ డిస్కషన్లు, పూర్తి స్క్రీన్ ప్లే కూడా పూర్తయింది. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. దీని వెనక ఓ కారణం ఉంది. ఈ ప్రాజెక్టు తను చేస్తున్నాననే విషయం అందరికీ ఆల్రెడీ తెలిసిపోయింది కాబట్టి, ఇంకాస్త ఎక్కువ ఇద్దామని మహేష్ ఆగిపోయాడు.

తండ్రి కృష్ణ బర్త్ డే సందర్భంగా మహేష్-పరశురామ్ సినిమాను అధికారికంగా ప్రకటిస్తారు. అంతేకాదు.. అదే రోజు సినిమా టైటిల్ ను కూడా ప్రకటిస్తారు. కుదిరితే మహేష్ నుంచి ఓ బ్రాండ్ న్యూ ఫొటో కూడా వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు.. సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పడ్నుంచి ఉంటుంది, రిలీజ్ డేట్ ఎప్పుడు లాంటి వివరాల్ని కూడా అదే రోజు ఒకేసారి అందించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇలా తన ఫ్యాన్స్ కోసం మహేష్ పెద్ద సర్ ప్రైజ్ సిద్ధంచేశాడు.

First Published:  16 April 2020 12:00 AM GMT
Next Story