Telugu Global
Cinema & Entertainment

ఈ యాప్ దూసుకొస్తోంది....

ప్రస్తుతం ఓటీటీ అంటే ఎవరికైనా అమెజాన్ ప్రైమ్ మాత్రమే అందరికీ గుర్తొస్తుంది. కాస్త ఇంగ్లిష్ కంటెంట్, వెబ్ సిరీస్ ఇష్టపడే వాళ్లకు నెట్ ఫ్లిక్స్ గుర్తొస్తుంది. ఈ రెండు మినహా మరే యాప్ పెద్దగా క్లిక్ అవ్వలేదు. రేసులో సన్ నెక్ట్స్, జీ5, ఆహా లాంటివి ఉన్నప్పటికీ పైన చెప్పుకున్న రెండు యాప్స్ కే ఆదరణ ఎక్కువ. ఇప్పుడు ఈ రెండు యాప్స్ కు గట్టిపోటీ ఇవ్వాలని నిర్ణయించుకుంది సన్ నెక్ట్స్. తన బలమైన సినిమాలతోనే వాటిని […]

ఈ యాప్ దూసుకొస్తోంది....
X

ప్రస్తుతం ఓటీటీ అంటే ఎవరికైనా అమెజాన్ ప్రైమ్ మాత్రమే అందరికీ గుర్తొస్తుంది. కాస్త ఇంగ్లిష్ కంటెంట్, వెబ్ సిరీస్ ఇష్టపడే వాళ్లకు నెట్ ఫ్లిక్స్ గుర్తొస్తుంది. ఈ రెండు మినహా మరే యాప్ పెద్దగా క్లిక్ అవ్వలేదు. రేసులో సన్ నెక్ట్స్, జీ5, ఆహా లాంటివి ఉన్నప్పటికీ పైన చెప్పుకున్న రెండు యాప్స్ కే ఆదరణ ఎక్కువ. ఇప్పుడు ఈ రెండు యాప్స్ కు గట్టిపోటీ ఇవ్వాలని నిర్ణయించుకుంది సన్ నెక్ట్స్. తన బలమైన సినిమాలతోనే వాటిని కొట్టాలని డిసైడ్ అయింది.

సూపర్ హిట్టయిన అల వైకుంఠపురములో సినిమా ఇప్పటికే సన్ నెక్ట్స్ లో ప్రత్యక్షమైంది. ఇవాళ్టి నుంచి విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాను స్ట్రీమింగ్ కు పెట్టింది సన్ నెక్ట్స్. ఈ సినిమాతో పాటు మరో 2 రోజుల్లో నాగశౌర్య నటించిన అశ్వథ్థామ సినిమాను కూడా స్ట్రీమింగ్ కు పెట్టబోతోంది.

మరోవైపు రీసెంట్ గా సూపర్ హిట్టయిన భీష్మ సినిమాను కూడా వీలైనంత తొందరగా యాప్ లో పెట్టాలని చూస్తోంది సన్ నెక్ట్స్. నితిన్, విజయ్ దేవరకొండ, నాగశౌర్య సినిమాలతో తమ యాప్ కు మరింత డిమాండ్ పెరుగుతుందని భావిస్తోంది. చూస్తుంటే.. ఈ లాక్ డౌన్ టైమ్ లో సన్ నెక్ట్స్ కాస్త గట్టిగానే మైలేజ్ సంపాదించుకునేలా ఉంది.

First Published:  14 April 2020 10:36 PM GMT
Next Story