Telugu Global
National

బాబు ఐడియాలో డొల్లతనం

కరోనా తీవ్రతను బట్టి ఆయా ప్రాంతాలను రెడ్, ఆరెంజ్, గ్రీన్‌ జోన్లుగా విభజించాలని ప్రధానికి సలహా ఇచ్చింది తానే అని చంద్రబాబు ప్రకటించుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ప్రధానితో రెండు నిమిషాలు మాట్లాడాలనుకుంటున్నానని… తాను పీఎంవో అధికారులకు విజ్ఞప్తి చేయగా… మరుసటి రోజు మోడీ ఫోన్ చేసి మాట్లాడారు అని చంద్రబాబు మీడియా సమావేశంలో చెప్పారు. కరోనా తీవ్రతను బట్టి ఆయా ప్రాంతాలను జోన్లుగా విభజించాలని సలహా ఇస్తూ ఈనెల 10నే మోడీకి లేఖ కూడా రాసినట్టు చెప్పారు. […]

బాబు ఐడియాలో డొల్లతనం
X

కరోనా తీవ్రతను బట్టి ఆయా ప్రాంతాలను రెడ్, ఆరెంజ్, గ్రీన్‌ జోన్లుగా విభజించాలని ప్రధానికి సలహా ఇచ్చింది తానే అని చంద్రబాబు ప్రకటించుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ప్రధానితో రెండు నిమిషాలు మాట్లాడాలనుకుంటున్నానని… తాను పీఎంవో అధికారులకు విజ్ఞప్తి చేయగా… మరుసటి రోజు మోడీ ఫోన్ చేసి మాట్లాడారు అని చంద్రబాబు మీడియా సమావేశంలో చెప్పారు. కరోనా తీవ్రతను బట్టి ఆయా ప్రాంతాలను జోన్లుగా విభజించాలని సలహా ఇస్తూ ఈనెల 10నే మోడీకి లేఖ కూడా రాసినట్టు చెప్పారు.

చంద్రబాబు చెప్పుకుంటున్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈనెల 11న ముఖ్యమంత్రులతో ప్రధాని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో తొలుత ఈ జోన్ల ప్రతిపాదనను ప్రధాని ముందు ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ఉంచారు. మొత్తం లాక్‌డౌన్ చేయడం వల్ల వ్యవసాయం స్తంభించిపోయింది, రైతులు నష్టపోతున్నారు… పారిశ్రామికరంగం కూడా దెబ్బతింటోంది. కాబట్టి కరోనా తీవ్రతను బట్టి జోన్లుగా విభజించి… కరోనా లేని ప్రాంతాల్లో వ్యవసాయం, పారిశ్రామిక రంగాలకు కొద్ది మేర సడలింపు ఇస్తే బాగుంటుందని జగన్‌మోహన్ రెడ్డి సూచన చేశారు.

జగన్‌ సూచనలపై తీవ్రంగా స్పందించిన టీడీపీ… కరోనా అంటే భయం లేదా… మొత్తం లాక్‌డౌన్ పెట్టాల్సిందిపోయి జోన్ల ప్రతిపాదన తెస్తారా? అంటూ జగన్‌పై విమర్శలు చేసింది. శ్రీకాకుళం టీడీపీ ఎంపీ రామ్మోహన్‌ నాయుడు… జగన్‌మోహన్ రెడ్డి పరిపక్వత లేకుండా మాట్లాడుతున్నారు అంటూ విమర్శలు చేశారు. కరోనా తీవ్రతను బట్టి ఆయా ప్రాంతాలను జోన్లుగా విభజించాలన్న జగన్‌ నిర్ణయం అనాలోచితంగా ఉందంటూ ఈనెల 13న తెలుగుదేశం పార్టీ తన అధికారిక పేస్‌బుక్ ఖాతాలో వీడియోను పోస్టు చేసింది.

ఈనెల 11నే జగన్‌ ఈ జోన్ల అంశాన్ని ప్రస్తావిస్తే విమర్శించిన టీడీపీ… ఇప్పుడు ఆ జోన్ల ఐడియా ప్రధానికి ఇచ్చింది నేనే అని చంద్రబాబు అనడంపై ఏ సమాధానం చెబుతుంది?. ఒకవేళ ఈనెల 10 న రాసిన లేఖలోనే చంద్రబాబు జోన్ల ఐడియా ప్రధానికి ఇచ్చి ఉంటే…. ఇన్ని రోజుల పాటు ఈ అంశాన్ని టీడీపీ గానీ, ఆ పార్టీ మీడియా గానీ ఎందుకు ప్రచారం చేయలేదు ? అని ప్రశ్నిస్తున్నారు.

First Published:  15 April 2020 2:02 AM GMT
Next Story