Telugu Global
NEWS

ఏపీ సీఎం ఆఫీసులో ఈ మార్పు గమనించారా ?

ఏపీ సీఎం జగన్‌ క్యాంపు కార్యాలయంలోని మీటింగ్‌ హాలులో స్వల్ప మార్పులు చేశారు. సీఎం కూర్చునే సీటు వెనుక పద్మం లాంటి ఆకారం కనిపిస్తుంది. ఆ పద్మం ఆకారం అంతా మొసలి చర్మం మీద ఉండే పొలుసుల్లాగా కనిపిస్తుంది. దీని వల్ల చాలా చెడ్డ వెబ్రేషన్స్‌ ఉంటాయని సమాచారం వెళ్లింది. ఇంతకుముందు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు సచివాలయంలో ఈ బ్యాక్‌ గ్రౌండ్‌ ను సెట్ చేశారు. అయితే  ఈ మధ్య జగన్ ప్రభుత్వానికి వరుసగా ఇబ్బందులు వస్తున్నాయి. దీంతో […]

ఏపీ సీఎం ఆఫీసులో ఈ మార్పు గమనించారా ?
X

ఏపీ సీఎం జగన్‌ క్యాంపు కార్యాలయంలోని మీటింగ్‌ హాలులో స్వల్ప మార్పులు చేశారు. సీఎం కూర్చునే సీటు వెనుక పద్మం లాంటి ఆకారం కనిపిస్తుంది. ఆ పద్మం ఆకారం అంతా మొసలి చర్మం మీద ఉండే పొలుసుల్లాగా కనిపిస్తుంది. దీని వల్ల చాలా చెడ్డ వెబ్రేషన్స్‌ ఉంటాయని సమాచారం వెళ్లింది.

ఇంతకుముందు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు సచివాలయంలో ఈ బ్యాక్‌ గ్రౌండ్‌ ను సెట్ చేశారు. అయితే ఈ మధ్య జగన్ ప్రభుత్వానికి వరుసగా ఇబ్బందులు వస్తున్నాయి. దీంతో కొంత మంది సూచన మేరకు ఈబ్యాక్‌ గ్రౌండ్‌ను తొలగించారని చెబుతున్నారు. ఏపీ ప్రభుత్వ ముద్రతో తెల్లటి బ్యాక్ గ్రౌండ్‌ను ఏర్పాటు చేశారు.

తెలంగాణ ప్రభుత్వంలో ఏ కేబినెట్ మీటింగ్‌ విజువల్స్‌ బయటకు రావు. కేంద్ర మంత్రి వర్గ సమావేశం విజువల్స్‌, ఫోటోలు విడుదల చేయరు. కానీ ఏపీలో మాత్రం టీడీపీ హాయాంలో ప్రతి కేబినెట్‌ మీటింగ్‌ విజువల్స్‌ను మీడియాకు పంపేవారు. ప్రచారం కోసం పాకులాడే చంద్రబాబు చేసే జిమ్మిక్కులు అవి.

కానీ ఇప్పుడు కూడా అదేదో పెద్ద సంప్రదాయం అంటూ పాటిస్తున్నారు. ఇలాంటివి పూర్తిగా మారితేనే జగన్ సర్కార్‌కు మంచి పేరు వస్తుందని సూచనలు చేస్తున్నారు.

First Published:  15 April 2020 5:23 AM GMT
Next Story