Telugu Global
Cinema & Entertainment

రజినీకాంత్ కు ట్రాన్స్ జెండర్లు భారీ షాక్

లాక్ డౌన్ మరింత కాలం పొడగిస్తూ దేశ ప్రధాని నరేంద్రమోడీ నిర్ణయం తీసుకున్నారు. మే 3 వరకు ఎవరూ ఇల్లుదాటి అడుగు బయటపెట్టడానికి వీల్లేదు. దీంతో ఈ 21 రోజులు ఓపిక పట్టిన జనాలు మోడీ మరింతకాలం లాక్ డౌన్ పొడిగింపు ప్రకటనతో ఉద్యోగ, ఉపాధి లేనివారంతా ఆందోళన పడుతున్నారు. తాజాగా తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఇంటిని  ట్రాన్స్ జెండర్లు చుట్టుముట్టారు. తమకూ ఆర్థిక సాయం చేయాలని కోరారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఫెఫ్సీ వర్కర్లకు […]

రజినీకాంత్ కు ట్రాన్స్ జెండర్లు భారీ షాక్
X

లాక్ డౌన్ మరింత కాలం పొడగిస్తూ దేశ ప్రధాని నరేంద్రమోడీ నిర్ణయం తీసుకున్నారు. మే 3 వరకు ఎవరూ ఇల్లుదాటి అడుగు బయటపెట్టడానికి వీల్లేదు. దీంతో ఈ 21 రోజులు ఓపిక పట్టిన జనాలు మోడీ మరింతకాలం లాక్ డౌన్ పొడిగింపు ప్రకటనతో ఉద్యోగ, ఉపాధి లేనివారంతా ఆందోళన పడుతున్నారు.

తాజాగా తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఇంటిని ట్రాన్స్ జెండర్లు చుట్టుముట్టారు. తమకూ ఆర్థిక సాయం చేయాలని కోరారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఫెఫ్సీ వర్కర్లకు రజినీకాంత్ ఇటీవలే రూ.50 లక్షల సాయం ప్రకటించారు.

ఈ నేపథ్యంలో ఉపాధి లేకుండా అలమటిస్తున్న ట్రాన్స్ జెండర్లకు కూడా రజినీకాంత్ విరాళాలు ఇవ్వాలని ఆయన ఇంటి ఎదుట మూకుమ్మడిగా వచ్చి ధర్నా నిర్వహించారు.

ప్రధానంగా ఈ ట్రాన్స్ జెండర్లు.. బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రైల్వే బోగీలలో ప్రయాణికులను అడుక్కుంటారు. ఇక కొందరు షాపుల వెంట తిరుగుతూ అడుక్కుంటారు. లాక్ డౌన్ తో సర్వం బంద్ కావడంతో వారికి ఉపాధి లేక తినడానికి తిండి లేక అలమటిస్తున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా తమిళనాడులోని చెన్నై పోయెస్ గార్డెన్ లో గల రజినీకాంత్ ఇంటికి చేరుకొని తమను ఆదుకోవాలని ఆయన ఇంటి ఎదుట ధర్నాకు దిగారు. ఇది చూసి షాకైన రజినీకాంత్, కుటుంబ సభ్యులు వెంటనే తేరుకున్నారు. రజినీకాంత్ సతీమణి లతా రజినీకాంత్ వారికి రూ.5వేలు ఇచ్చారు. దీంతో శాంతించిన ట్రాన్స్ జెండర్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు. లాక్ డౌన్ సమయంలో రజినీకాంత్ ఇంటి ఎదుట ఈ ధర్నా చర్చనీయాంశమైంది.

First Published:  14 April 2020 1:55 AM GMT
Next Story