Telugu Global
Cinema & Entertainment

మాస్ రాజాతో మెగాహీరో

మాస్ రాజా రవితేజతో మెగా హీరో సాయితేజ్ సినిమా. ఇదేదో గాసిప్ కాదు. అలా అని చర్చల్లో ఉన్న ప్రాజెక్టు కూడా కాదు. స్వయంగా సాయితేజ్ తన మనసులో ఉన్న కోరికను ఇలా బయటపెట్టాడు. కుదిరితే రవితేజతో ఓ మల్టీస్టారర్ చేయాలని ఉందంటూ ప్రకటించాడు సాయితేజ్. లాక్ డౌన్ వల్ల ఇంట్లో ఉన్న ఈ హీరో, తన అభిమానులతో సోషల్ మీడియాలో ఛాట్ చేశాడు. ఈ సందర్భంగా మల్టీస్టారర్లపై తన అభిప్రాయాల్ని బయటపెట్టాడు. రవితేజతో చేయాలని ఉందనే […]

మాస్ రాజాతో మెగాహీరో
X

మాస్ రాజా రవితేజతో మెగా హీరో సాయితేజ్ సినిమా. ఇదేదో గాసిప్ కాదు. అలా అని చర్చల్లో ఉన్న ప్రాజెక్టు కూడా కాదు. స్వయంగా సాయితేజ్ తన మనసులో ఉన్న కోరికను ఇలా బయటపెట్టాడు. కుదిరితే రవితేజతో ఓ మల్టీస్టారర్ చేయాలని ఉందంటూ ప్రకటించాడు సాయితేజ్.

లాక్ డౌన్ వల్ల ఇంట్లో ఉన్న ఈ హీరో, తన అభిమానులతో సోషల్ మీడియాలో ఛాట్ చేశాడు. ఈ సందర్భంగా మల్టీస్టారర్లపై తన అభిప్రాయాల్ని బయటపెట్టాడు. రవితేజతో చేయాలని ఉందనే విషయాన్ని బయటపెడుతూనే.. అవకాశం వస్తే పవన్ కల్యాణ్ తో ఓ మాస్ మసాలా ఎంటర్ టైన్ మెంట్ చేయాలని ఉందని కూడా చెప్పుకొచ్చాడు.

ఇక నిజంగా మల్టీస్టారర్స్ చేయాల్సి వస్తే ఆన్ స్క్రీన్ తను కంఫర్టబుల్ గా ఫీలయ్యే నటుడు వరుణ్ తేజ్ మాత్రమే అంటున్నాడు సాయితేజ్. వరుణ్ తో తను చాలా క్లోజ్ గా ఉంటానని, కాబట్టి అతడితో మల్టీస్టారర్ చేస్తే చాలా కంఫర్ట్ గా ఉంటుందని చెబుతున్నాడు. మొత్తానికి ఈ మెగా హీరోకు మల్టీస్టారర్ ఆలోచనలు బాగానే ఉన్నట్టున్నాయి.

First Published:  13 April 2020 8:01 PM GMT
Next Story