Telugu Global
National

ఆకలి వికృత రూపం

లాక్ డౌన్ 21 రోజులు గడిచిన తరవాత పేదల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో ఆగ్రాలోని ఈ దృశ్యం కళ్లకు కడుతోంది. ఆగ్రాలోని రామ్ బాగ్ చౌరాహ్ వద్ద ఒక పాల క్యాన్ రోడ్డు మీద ఒలికి పోయింది. వెంటనే కుక్కలు ఆ పాలను నాకడం మొదలుపెట్టాయి. వాటికి లాక్ డౌన్ కారణంగా తిండి దొరకని ఒక మనిషి కూడా తోడయ్యాడు. లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా అనేక మంది పేదలు ఆకలికి అల్లాడి పోతున్నారు. ఆకలికి […]

ఆకలి వికృత రూపం
X

లాక్ డౌన్ 21 రోజులు గడిచిన తరవాత పేదల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో ఆగ్రాలోని ఈ దృశ్యం కళ్లకు కడుతోంది. ఆగ్రాలోని రామ్ బాగ్ చౌరాహ్ వద్ద ఒక పాల క్యాన్ రోడ్డు మీద ఒలికి పోయింది. వెంటనే కుక్కలు ఆ పాలను నాకడం మొదలుపెట్టాయి. వాటికి లాక్ డౌన్ కారణంగా తిండి దొరకని ఒక మనిషి కూడా తోడయ్యాడు.

లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా అనేక మంది పేదలు ఆకలికి అల్లాడి పోతున్నారు. ఆకలికి తాళలేక లక్షలాది మంది కాలి నడకన తమ సొంత ఊళ్లకు వెళ్లిపోయారు. పోతున్నారు. మన దేశంలో అనియత రంగంలో పని చేస్తున్న 40 కోట్ల మంది భారతీయులు మరింతగా పేదరికంలో కూరుకుపోతారని అంతర్జాతీయ కార్మిక సంస్థ హెచ్చరించింది.

పేదల ఖాతాల్లోకి నగదు బదిలీ చేస్తామన్న వాగ్దానాలు లాక్ డౌన్ మొదలైన 21 రోజులకు గానీ ప్రారంభం కాలేదు. అదీ అరకొరగానే. చాలా మంది ఇంకా తమ ఖాతాలో నగదు జమ కాలేదంటున్నారు. బ్యాంకులో డబ్బులు పడితే తెచ్చుకుందామనుకునే కొందరిపై పోలీసులు ప్రతాపం చూపిస్తున్నారు.

లాక్ డౌన్ వల్ల కరోనా వైరస్ వ్యాప్తిని కొంతైనా కట్టడి చేసి ఉండవచ్చు… కానీ తగిన ఏర్పాట్లు లేనందువల్ల పేదల పరిస్థితి దారుణంగా ఉంది. తాజా ఉపద్రవం వల్ల ఆర్థిక వ్యవస్థ కుదేలై పోవడం ఖాయం కనక పేదల పరిస్థితి ఇంకా దిగజారి ఇలాంటి దృశ్యాలు పెరిగిపోతాయేమో!

First Published:  14 April 2020 12:46 AM GMT
Next Story