Telugu Global
Cinema & Entertainment

జాక్వెలిన్ రెడీ.... కానీ

ప్రస్తుతం చేస్తున్న పింక్ రీమేక్ వకీల్ సాబ్ తో పాటు క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమాకు కమిట్ అయ్యాడు పవన్. కరోనా లేకపోతే ఈపాటికి ఈ సినిమా కూడా సెట్స్ పై ఉండేది. కానీ లాక్ డౌన్ కారణంగా సినిమా షూట్ ఆగిపోయింది. అయితే దీనికోసం వేసిన సెట్ మాత్రం అలానే ఉంది. లాక్ డౌన్ ముగిసిన వెంటనే ఆ సెట్ లో షూట్ ప్రారంభమౌతుంది. తొలి షెడ్యూల్ లోనే బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ జాయిన్ […]

జాక్వెలిన్ రెడీ.... కానీ
X

ప్రస్తుతం చేస్తున్న పింక్ రీమేక్ వకీల్ సాబ్ తో పాటు క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమాకు కమిట్ అయ్యాడు పవన్. కరోనా లేకపోతే ఈపాటికి ఈ సినిమా కూడా సెట్స్ పై ఉండేది. కానీ లాక్ డౌన్ కారణంగా సినిమా షూట్ ఆగిపోయింది. అయితే దీనికోసం వేసిన సెట్ మాత్రం అలానే ఉంది. లాక్ డౌన్ ముగిసిన వెంటనే ఆ సెట్ లో షూట్ ప్రారంభమౌతుంది.

తొలి షెడ్యూల్ లోనే బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ జాయిన్ అవుతుంది. ఈ మేరకు ఆమె కాల్షీట్లు ఇచ్చింది. నిజానికి ఈ నెలలోనే ఆమె కాల్షీట్లు ఇచ్చింది. కానీ లాక్ డౌన్ వల్ల కుదర్లేదు. ఇప్పుడు తన కాల్షీట్లను మే నెలలో కూడా కేటాయించింది. పవన్ రావడమే ఆలస్యం అన్నమాట.

మొఘల్ కాలంనాటి స్టోరీలైన్ తో తెరకెక్కుతోంది పవన్-క్రిష్ సినిమా. ఈ మూవీ కోసం 4-5 భారీ సెట్స్ ప్లాన్ చేస్తున్నారు. మ్యాగ్జిమమ్ షూటింగ్ మొత్తం సెట్స్ లోనే చేయాలనేది ప్లాన్. ఓ 20శాతం షూట్ కోసం మాత్రం ఔట్ డోర్ కు వెళ్తారు. ఈ సినిమాలో జాక్వెలిన్ యువరాణిగా కనిపించనుందట. పవన్ దొంగగా కనిపించబోతున్నాడు. నెక్ట్స్ షెడ్యూల్ ప్రారంభమైన వెంటనే పవన్-జాక్వెలిన్ మధ్య ఓ సాంగ్ తీయాలనేది ప్లాన్.

First Published:  13 April 2020 9:38 PM GMT
Next Story