Telugu Global
NEWS

తిత్లీ తాట తీసిన వేళ బాబు సాయం ఎట్టిదనగా....

అధికారంలో ఉన్న ఐదేళ్లు కూడా చంద్రబాబు పదేపదే బీద నినాదాలే వినిపించాడు. ఏది అడిగినా డబ్బులు లేవు, లోటు రాష్ట్రం, కట్టుబట్టలతో బయటకు వచ్చాం అనే వాడు. ఇప్పుడు మాత్రం కరోనా వచ్చినా సరే ఏ చెల్లింపులు ఆగడానికి వీల్లేదంటున్నాడు చంద్రబాబు. పైగా ఒక్కో కుటుంబానికి ఐదువేలు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నాడు. ఐదు వేల కోసం దీక్షలు చేయాలని టీడీపీ ఎమ్మెల్యేలను హైదరాబాద్‌ నుంచి బాబు పురమాయిస్తున్నాడు. కానీ గతంలో తాను సీఎంగా ఉన్నప్పుడు విపత్తులు వస్తే […]

తిత్లీ తాట తీసిన వేళ బాబు సాయం ఎట్టిదనగా....
X

అధికారంలో ఉన్న ఐదేళ్లు కూడా చంద్రబాబు పదేపదే బీద నినాదాలే వినిపించాడు. ఏది అడిగినా డబ్బులు లేవు, లోటు రాష్ట్రం, కట్టుబట్టలతో బయటకు వచ్చాం అనే వాడు. ఇప్పుడు మాత్రం కరోనా వచ్చినా సరే ఏ చెల్లింపులు ఆగడానికి వీల్లేదంటున్నాడు చంద్రబాబు. పైగా ఒక్కో కుటుంబానికి ఐదువేలు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నాడు.

ఐదు వేల కోసం దీక్షలు చేయాలని టీడీపీ ఎమ్మెల్యేలను హైదరాబాద్‌ నుంచి బాబు పురమాయిస్తున్నాడు. కానీ గతంలో తాను సీఎంగా ఉన్నప్పుడు విపత్తులు వస్తే ఇదే బాబు అందుకు భిన్నంగా స్పందించాడు. పక్క రాష్ట్రాల వద్ద ఏపీ పరువు తీసిన ట్రాక్ రికార్డు కూడా బాబుకుంది.

చంద్రబాబు నాయుడు హయాంలో తిత్లీ తుపాను వచ్చింది. ఆ సమయంలో తిత్లీ తాట తీశామని టీడీపీ వాళ్లు ప్రచారం చేసుకున్నారు. తిత్లీ తుపాను శ్రీకాకుళం జిల్లాలో వస్తే తిత్లీని జయించిన చంద్రబాబుకు ధన్యవాదాలు అంటూ విజయవాడలో టీడీపీ నేతలు ఫ్లెక్సీ కట్టిన ఉందంతాలు ఉన్నాయి. అదే ఫ్లెక్సీలు శ్రీకాకుళం జిల్లాలో ఎందుకు ఏర్పాటు చేయలేదు అంటే … వాస్తవ పరిస్థితి అక్కడి స్థానిక ప్రజలకు తెలుసు కాబట్టి.

తిత్లీ తుపాను మన రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాతో పాటు పక్కనే ఉన్న ఒడిషా రాష్ట్రంలోని గజపతి జిల్లాను కూడా తీవ్రంగా దెబ్బతీసింది. దాంతో ఇటు చంద్రబాబు, అటు నవీన్ పట్నాయక్ ప్రభుత్వాలు తిత్లీ బాధితులకు ఎలా సాయం అందిస్తున్నారన్నది పోల్చడానికి అవకాశం ఏర్పడింది. రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో రట్టిణి అనే ఒక గ్రామం ఉంది. ఈ గ్రామం సగం ఒడిషా ప్రభుత్వ ఆధీనంలో ఉండగా… మిగిలిన సగ భాగం ఏపీ ఆధీనంలో ఉంటుంది.

తిత్లీ తుపాను రాగానే ఈ గ్రామంలో ప్రధాన వీధికి అటువైపు ఒడిషా ప్రభుత్వం… ఇటువైపు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సహాయక చర్యలను ప్రారంభించింది. నవీన్ పట్నాయక్ ప్రభుత్వం…. తుపాను వచ్చిన మరుసటి రోజే తమ పరిధిలోని ఒక్కో కుటుంబానికి 50కిలోల బియ్యం, టార్చిలైట్లు, తాత్కాలిక గూడు కోసం టార్పాలిన్లు, కొవ్వుత్తులు, సోలార్ లాంతర్లను పంపిణీ చేసింది. దానితో పాటు ఒక్కో ఇంటికి వెయ్యి రూపాయల నగదు అందచేసింది. మరో రెండు వేల రూపాయలు బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది.

అదే రట్టిణి గ్రామంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పరిధిలో ఉన్న కుటుంబాలకు చంద్రబాబు ప్రభుత్వం అందించిన సాయం ఏమిటంటే ?. ఒడిషా ప్రభుత్వం 50 కిలోల బియ్యం ఇస్తే… చంద్రబాబు ప్రభుత్వం 25 కిలోలు ఇచ్చింది. అర కిలో చక్కర, రెండు కొవ్వుత్తులు ఇచ్చి చేతులు దులుపుకుంది. ఈ సాయం కూడా జన్మభూమి కమిటీల దయాదాక్షిణ్యాల మీద జరిగింది. మొత్తం సామాగ్రిని స్థానిక టీడీపీ నేతల ఇళ్లకు తరలించి అక్కడి నుంచి జన్మభూమి కమిటీల కనుసన్నల్లో సాయం అందించారు. ఒడిషా ప్రభుత్వం ఇంటికి వెయ్యి రూపాయల నగదు, మరో రెండు వేలు బ్యాంకు ఖాతాలో వేస్తే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం పైసా ఇవ్వలేదు.

తిత్లీ తుపాను వచ్చిన సమయంలో శ్రీకాకుళం జిల్లా తప్ప మిగిలిన జిల్లాలు బాగానే ఉన్నాయి. ప్రభుత్వానికి రోజు వారి ఆదాయం వస్తూనే ఉంది. అయినా సరే ఒడిషా ముందు ఏపీ పరువు తీసేలా చంద్రబాబు తిత్లీ సమయంలో వ్యవహరించారు. ప్రచారం మాత్రం తిత్లీ తాట తీసేశాం అంటూ విజయవాడలో భారీ హోర్డింగ్‌లతో హోరెత్తించారు.

విపత్తుల సమయంలో గతంలో అలా పక్క రాష్ట్రాల ముందు పరువు తీసేలా పనిచేసిన చంద్రబాబు… ఇప్పుడు మాత్రం ఇంటికి 5వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పైగా ఇప్పుడు మొత్తం దేశం, రాష్టమే స్తంభించిపోయింది. ప్రభుత్వానికి ఒక్క రూపాయి ఆదాయం రావడం లేదు. అయినా సరే టీడీపీ నేతలు ధర్నాలు చేస్తున్నారు. చంద్రబాబు హైదరాబాద్‌లో కూర్చుని డైరెక్షన్ చేస్తున్నారు. ఈ విషయంలో చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వాన్ని మాత్రం పల్తెత్తు మాట అనకపోవడం కూడా ఆయన భయభక్తిని తెలియజేస్తోంది.

First Published:  14 April 2020 2:20 AM GMT
Next Story