Telugu Global
International

సానియా పదో పెళ్లిరోజు వేడుక

భారత్ లో సానియా-పాక్ లో మాలిక్ దాయాది దేశాలు భారత్, పాకిస్థాన్ ద్వైపాక్షిక సంబంధాలు ఎడమొకం పెడమొకంగా ఉంటున్నా… భారత్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాక్ సీనియర్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ల వివాహబంధం నువ్వక్కడ, నేనిక్కడ అన్నట్లుగా సాగుతూ వస్తోంది. 2010లో పలురకాల వివాదాల నడుమ …వివాదాస్పద రీతిలో నిఖా బంధంతో ఒక్కటైన సానియా మీర్జా, షోయబ్ మాలిక్ లు… కరోనా వైరస్ నేపథ్యంలో తమ పదో వివాహ దినోత్సవ వేడుకను పరస్పర సందేశాల నడుమ […]

సానియా పదో పెళ్లిరోజు వేడుక
X
  • భారత్ లో సానియా-పాక్ లో మాలిక్

దాయాది దేశాలు భారత్, పాకిస్థాన్ ద్వైపాక్షిక సంబంధాలు ఎడమొకం పెడమొకంగా ఉంటున్నా… భారత్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాక్ సీనియర్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ల వివాహబంధం నువ్వక్కడ, నేనిక్కడ అన్నట్లుగా సాగుతూ వస్తోంది.

2010లో పలురకాల వివాదాల నడుమ …వివాదాస్పద రీతిలో నిఖా బంధంతో ఒక్కటైన సానియా మీర్జా, షోయబ్ మాలిక్ లు… కరోనా వైరస్ నేపథ్యంలో తమ పదో వివాహ దినోత్సవ వేడుకను పరస్పర సందేశాల నడుమ జరుపుకొన్నారు.

ఓవైపు ప్రపంచ దేశాలు, మరోవైపు భారత్, పాక్ దేశాలు కరోనా మహమ్మారితో అలుపెరుగని పోరాటం చేస్తుంటే గత ఏడాదే తల్లిదండ్రుల హోదా సంపాదించిన సానియా-షోయబ్ మాలిక్ జోడీ… పదవ పెళ్లిరోజును తమదైన శైలిలో జరుపుకొన్నారు.

సానియా తన కుమారుడు ఇజాన్ తో కలసి హైదరాబాద్ లోని పుట్టింటిలోనే నివాసం ఉంటుంటే… షోయబ్ మాలిక్ పాకిస్థాన్ లోని సియాల్ కోటలో ఉంటున్నాడు.

కరోనా వైరస్ నేపథ్యంలో మార్చి 14 నుంచే భారత ప్రభుత్వం విదేశీయులకు వీసాలు ఇవ్వటం నిలిపివేయడంతో… షోయబ్ మాలిక్ తన దేశానికే పరిమితం కావాల్సి వచ్చింది.

అంతేకాదు పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్లో పాల్గొనటం కోసం షోయబ్ మాలిక్ స్వదేశంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. అయితే…సానియా మాత్రం పాక్ లో ఉన్న తన భర్తకు…. 10వ వివాహదినోత్సవ శుభాకాంక్షలను..ఓ సందేశంతో పాటు వివిధ సందర్భాలలో తాము కలసి దిగిన ఫోటోలతో కలిపి పంపింది.

పదేళ్ల వివాహజీవితంలో అంచనాలు- వాస్తవాలు అంటూ క్లుప్తంగా షోయబ్ మాలిక్ కు సందేశాన్ని పంపింది.

సానియా కరోనా సేవ…

కరోనా వైరస్ దెబ్బతో కేంద్రప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించడంతో…రోజువారీ పనులు చేసుకొంటూ పొట్టపోసుకొనేవారిని ఆదుకోడానికి సానియా తన స్నేహితులతో కలసి ముందుకు వచ్చింది.

ఇప్పటికే 3వేల మందికి ఆహారపదార్థాలు అందించడంతో పాటు…సహాయనిధికోసం కోటి 25 లక్షల రూపాయలు సేకరించింది. ఈ మొత్తంతో లక్షమందికి ఆహారం అందించాలన్నది తన లక్ష్యమని ప్రకటించింది.

మరోవైపు…పాకిస్థాన్ లో కరోనా వైరస్ బాధితుల సహాయం కోసం పాక్ కాంట్రాక్టు క్రికెటర్లందరూ కలసి 50 లక్షల రూపాయలు అందచేశారు. ఇందులో షోయబ్ మాలిక్ సైతం భాగస్వామిగా ఉన్నాడు.

First Published:  12 April 2020 7:43 PM GMT
Next Story