Telugu Global
NEWS

లాక్‌డౌన్‌ పటిష్టంగా అమలుతో ఏపీలో కరోనా కేసులు తగ్గాయి " ఎన్డీటీవీ

లాక్‌డౌన్‌ పటిష్టంగా అమలు చేసిన రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుతున్నాయని ఎన్డీటీవీ అంచనా వేసింది. కేరళ, ఆంధ్రప్రదేశ్‌, కర్నాటకలో లాక్‌డౌన్‌ రెండో వారంలో అప్పటివరకూ పెరిగిన కేసులు తగ్గాయని వివరించింది. లాక్‌డౌన్‌ ప్రారంభవారంలో కొన్ని రాష్ట్రాల్లో తక్కువ కేసులు నమోదు అయ్యాయి. ఆతర్వాత మర్కజ్‌ కేసులు బయటకు రావడంతో ఒక్కసారిగా కరోనా కేసులు డబుల్‌ అయ్యాయి. ఏపీలో లాక్‌డౌన్‌ మొదటి వారం ముగిసే సమయంలో ప్రతి రోజు కేసులు రెట్టింపు నమోదు అయ్యాయి, అయితే లాక్‌డౌన్‌ పటిష్టంగా […]

లాక్‌డౌన్‌ పటిష్టంగా అమలుతో ఏపీలో కరోనా కేసులు తగ్గాయి  ఎన్డీటీవీ
X

లాక్‌డౌన్‌ పటిష్టంగా అమలు చేసిన రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుతున్నాయని ఎన్డీటీవీ అంచనా వేసింది. కేరళ, ఆంధ్రప్రదేశ్‌, కర్నాటకలో లాక్‌డౌన్‌ రెండో వారంలో అప్పటివరకూ పెరిగిన కేసులు తగ్గాయని వివరించింది.

లాక్‌డౌన్‌ ప్రారంభవారంలో కొన్ని రాష్ట్రాల్లో తక్కువ కేసులు నమోదు అయ్యాయి. ఆతర్వాత మర్కజ్‌ కేసులు బయటకు రావడంతో ఒక్కసారిగా కరోనా కేసులు డబుల్‌ అయ్యాయి. ఏపీలో లాక్‌డౌన్‌ మొదటి వారం ముగిసే సమయంలో ప్రతి రోజు కేసులు రెట్టింపు నమోదు అయ్యాయి, అయితే లాక్‌డౌన్‌ పటిష్టంగా అమలు చేయడంతో ఇప్పుడు ప్రతి 15 రోజులకు రెట్టింపు అవుతున్నాయని ఎన్డీటీవీ తెలిపింది.

ప్రస్తుతం ఏపీలో 420 కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 12 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఏడుగురు మరణించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 401. జిల్లాలవారీగా చూసుకుంటే కర్నూలులో 84, గుంటూరులో 82 కేసులు ఎక్కువగా నమోదు అయ్యియి. శ్రీకాకుళం, విజయనగరంలో ఇప్పటివరకూ ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు బయటపడలేదు.

తెలంగాణలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 531కి చేరింది. మరణించిన వారి సంఖ్య 16కు పెరిగింది. డిశ్చార్జి అయిన వారి సంఖ్య 103. . మిగతా 412 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఇటు కేరళలో కూడా కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. 68 రోజల కిందట కేరళలో తొలి పాజిటివ్‌ కేసు నమోదైంది. ప్రస్తుతం 374 పాజటివ్‌ కేసులు ఉన్నాయి. 142 మంది రికవరీ అయ్యారు. గత వారం రోజులుగా ఇక్కడ పాజిటివ్‌ కేసులు సంఖ్య తగ్గుతూ వస్తోంది.

First Published:  12 April 2020 7:37 PM GMT
Next Story