Telugu Global
Cinema & Entertainment

బన్నీ ఫ్లాన్ కు కరోనా అడ్డంకి

ఈ ఏడాది జనవరిలో సంక్రాంతి స్పెషల్ గా అల వైకుంఠపురములో సినిమా థియేటర్లలోకి వచ్చింది. సో.. ఈ ఏడాది బన్నీ నుంచి రెండు సినిమాలు గ్యారెంటీ అని ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్. బన్నీ కూడా అలానే అనుకున్నాడు. నా పేరు సూర్యతో వచ్చిన గ్యాప్ ను ఈ ఏడాది భర్తీ చేయాలని అనుకున్నాడు. కానీ బన్నీ ప్లాన్స్ కు కరోనా అడ్డంకిగా మారింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ పాటికి బన్నీ-సుకుమార్ సినిమా కాంబినేషన్ లో పుష్ప […]

బన్నీ ఫ్లాన్ కు కరోనా అడ్డంకి
X

ఈ ఏడాది జనవరిలో సంక్రాంతి స్పెషల్ గా అల వైకుంఠపురములో సినిమా థియేటర్లలోకి వచ్చింది. సో.. ఈ ఏడాది బన్నీ నుంచి రెండు సినిమాలు గ్యారెంటీ అని ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్. బన్నీ కూడా అలానే అనుకున్నాడు. నా పేరు సూర్యతో వచ్చిన గ్యాప్ ను ఈ ఏడాది భర్తీ చేయాలని అనుకున్నాడు. కానీ బన్నీ ప్లాన్స్ కు కరోనా అడ్డంకిగా మారింది.

అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ పాటికి బన్నీ-సుకుమార్ సినిమా కాంబినేషన్ లో పుష్ప సినిమా షూటింగ్ శరవేగంగా నడుస్తూ ఉండేది. అక్టోబర్ లేదా నవంబర్ నాటికి రిలీజ్ చేసి ఉండేవారు. కానీ కరోనా కారణంగా ఈ సినిమా వాయిదా పడింది. కేరళలో అనుకున్న షెడ్యూల్ క్యాన్సిల్ అయింది. తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లిలో అనుకున్న షెడ్యూల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలీదు.

మరోవైపు లాక్ డౌన్ ను పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో బన్నీ సినిమా మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ క్రోడీకరించి చూసుకుంటే.. ఈ ఏడాది పుష్ప సినిమా థియేటర్లలోకి వచ్చేది అనుమానమే. అలా 2020లో రెండు సినిమాలు రిలీజ్ చేయాలనుకున్న బన్నీ ప్లాన్ కు కరోనా గండి కొట్టింది.

First Published:  12 April 2020 10:03 PM GMT
Next Story