Telugu Global
Cinema & Entertainment

తెలుగు తెరకు మరో కొత్త విలన్

సీనియర్ హీరోలంతా మెల్లగా క్యారెక్టర్ ఆర్టిస్టులుగా విలన్ లుగా మారిపోతున్నారు. ఇప్పటికే సీనియర్ హీరోలైన అర్జున్, జగపతిబాబు విలన్ లుగా మారిపోయారు. కేవలం మారిపోవడం కాదు, విలన్ లుగా మెప్పించారు కూడా. ఇప్పుడీ బాటలో ఉపేంద్ర కూడా నడుస్తున్నాడు. కన్నడ నాట ప్రముఖ హీరోగా కొనసాగుతున్న ఉపేంద్ర, ఓ భారీ సినిమాతో తెలుగుతెరకు విలన్ గా పరిచయం అవ్వబోతున్నాడు. త్వరలోనే పరశురామ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు మహేష్ బాబు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై […]

తెలుగు తెరకు మరో కొత్త విలన్
X

సీనియర్ హీరోలంతా మెల్లగా క్యారెక్టర్ ఆర్టిస్టులుగా విలన్ లుగా మారిపోతున్నారు. ఇప్పటికే సీనియర్ హీరోలైన అర్జున్, జగపతిబాబు విలన్ లుగా మారిపోయారు. కేవలం మారిపోవడం కాదు, విలన్ లుగా మెప్పించారు కూడా. ఇప్పుడీ బాటలో ఉపేంద్ర కూడా నడుస్తున్నాడు. కన్నడ నాట ప్రముఖ హీరోగా కొనసాగుతున్న ఉపేంద్ర, ఓ భారీ సినిమాతో తెలుగుతెరకు విలన్ గా పరిచయం అవ్వబోతున్నాడు.

త్వరలోనే పరశురామ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు మహేష్ బాబు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రాబోతున్న ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ లో విలన్ గా ఉపేంద్రను తీసుకోవాలని అనుకుంటున్నారు. ఈ మేరకు చర్చలు కూడా ప్రారంభమయ్యాయి.

నిజానికి నెగెటివ్ షేడ్స్ లో ఉపేంద్ర కనిపించడం ఇదే ఫస్ట్ టైమ్ కాదు. బన్నీ హీరోగా నటించిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో అతడిది నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రే. అయితే అందులో ఉపేంద్రను పూర్తిస్థాయిలో విలన్ గా చూపించలేదు త్రివిక్రమ్. పైపెచ్చు అక్కడక్కడ ఫ్యామిలీ మేన్ గా చూపించాడు. ఇక క్లైమాక్స్ కు వచ్చేసరికి మారిన మనిషిగా కూడా చూపించాడు.

పరశురామ్-మహేష్ బాబు సినిమాలో మాత్రం ఉపేంద్ర క్యారెక్టర్ పక్కా విలనిజంతో ఉంటుందట. చివర్లో మహేష్ చేతిలో ఈ పాత్ర చనిపోతుందని కూడా చెబుతున్నారు. ఈ విలన్ పాత్రతో పాటు హీరోయిన్ పాత్రపై కూడా చాలా పుకార్లు నడుస్తున్నాయి. లాక్ డౌన్ తర్వాత వీటిపై ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.

First Published:  12 April 2020 6:26 AM GMT
Next Story