Telugu Global
Cinema & Entertainment

ఉదయ్ కిరణ్ భార్యపై ఆయన సోదరి శ్రీదేవి సంచలన కామెంట్స్...

ఉదయ్ కిరణ్.. టాలీవుడ్ లో దూసుకొచ్చిన హీరో. ఫీల్ గుడ్ లవ్ స్టోరీలతో వరుసగా మూడు హిట్స్ తో టాలీవుడ్ లోనే స్టార్ గా మారిపోయాడు. అయితే అనంతరం ఒక అగ్రహీరో కూతురితో నిశ్చితార్థం క్యాన్సిల్ కావడం.. అతడితో సినిమాలు చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడం… వరుస ఫ్లాపులు… అనేక ఇబ్బందులతో 2014లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పటికీ ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు సరైన కారణాలు వెలుగులోకి రాలేదు. అయితే తాజాగా ఉదయ్ కిరణ్ సోదరి శ్రీదేవి పలు […]

ఉదయ్ కిరణ్ భార్యపై ఆయన సోదరి శ్రీదేవి సంచలన కామెంట్స్...
X

ఉదయ్ కిరణ్.. టాలీవుడ్ లో దూసుకొచ్చిన హీరో. ఫీల్ గుడ్ లవ్ స్టోరీలతో వరుసగా మూడు హిట్స్ తో టాలీవుడ్ లోనే స్టార్ గా మారిపోయాడు. అయితే అనంతరం ఒక అగ్రహీరో కూతురితో నిశ్చితార్థం క్యాన్సిల్ కావడం.. అతడితో సినిమాలు చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడం… వరుస ఫ్లాపులు… అనేక ఇబ్బందులతో 2014లో ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇప్పటికీ ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు సరైన కారణాలు వెలుగులోకి రాలేదు. అయితే తాజాగా ఉదయ్ కిరణ్ సోదరి శ్రీదేవి పలు ఇంటర్వ్యూలలో సంచలన వ్యాఖ్యలు చేస్తోంది. ఉదయ్ కిరణ్ ఆత్మహత్య, అప్పటి పరిస్థితులు… అతడి భార్య తాజా ప్రవర్తనపై అనుమానాలు వ్యక్తం చేస్తోంది.

ఉదయ్ కిరణ్ సోదరి ప్రస్తుతం దుబాయ్ లో స్థిరపడ్డారు. తాజాగా ఆమె తన తమ్ముడు ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులు కారణం కాదని.. ఇంకేదో ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇన్నాళ్లు దాచామని.. త్వరలోనే తెలుసుకుంటానని తెలిపారు.

ఉదయ్ కిరణ్ మరణం తర్వాత ఆస్తులని స్వాధీనం చేసుకునేందుకు అతడి భార్య ప్రయత్నిస్తోందని సోదరి శ్రీదేవి సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాను ఉదయ్ కిరణ్ భార్యతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తుండగా ఆమె పారిపోతోందని… అస్సలు కలవడం లేదని… దీనివెనుక నిజానిజాలు వెలుగులోకి తెస్తానని కామెంట్ చేసింది. ఈ నేపథ్యంలో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య వ్యవహారంపై తనకు అనుమానాలు కలుగుతున్నాయని తెలిపింది.

First Published:  12 April 2020 3:03 AM GMT
Next Story