Telugu Global
Cinema & Entertainment

ఆర్ఆర్ఆర్ వాయిదా పడుతుందా?

ఆర్ఆర్ఆర్ పై మరో భారీ పుకారు చెలరేగింది. చెప్పిన టైమ్ కు ఆర్ఆర్ఆర్ రాకపోవచ్చంటూ కొన్ని నెలల కిందట పుకార్లు మొదలయ్యాయి. ఆ ప్రచారానికి తగ్గట్టే సినిమా వాయిదాపడింది. జులైలో రావాల్సిన మూవీని 2021 సంక్రాంతికి వాయిదావేశాడు రాజమౌళి. ఇప్పుడు ఆ తేదీకి కూడా సినిమా రాకపోవచ్చంటూ మరోసారి జోరుగా ప్రచారం నడుస్తోంది. ఈసారి ఏమౌతుందో చూడాలి. ఆర్ఆర్ఆర్ షూటింగ్ కు కరోనా అడ్డంకిగా మారింది. ప్రస్తుతానికి సినిమాకు సంబంధించి అన్ని పనులు ఆగిపోయాయి. నెక్ట్స్ షెడ్యూల్ […]

ఆర్ఆర్ఆర్ వాయిదా పడుతుందా?
X

ఆర్ఆర్ఆర్ పై మరో భారీ పుకారు చెలరేగింది. చెప్పిన టైమ్ కు ఆర్ఆర్ఆర్ రాకపోవచ్చంటూ కొన్ని నెలల కిందట పుకార్లు మొదలయ్యాయి. ఆ ప్రచారానికి తగ్గట్టే సినిమా వాయిదాపడింది. జులైలో రావాల్సిన మూవీని 2021 సంక్రాంతికి వాయిదావేశాడు రాజమౌళి. ఇప్పుడు ఆ తేదీకి కూడా సినిమా రాకపోవచ్చంటూ మరోసారి జోరుగా ప్రచారం నడుస్తోంది. ఈసారి ఏమౌతుందో చూడాలి.

ఆర్ఆర్ఆర్ షూటింగ్ కు కరోనా అడ్డంకిగా మారింది. ప్రస్తుతానికి సినిమాకు సంబంధించి అన్ని పనులు ఆగిపోయాయి. నెక్ట్స్ షెడ్యూల్ కు కూడా నటీనటులు అందుబాటులోకి రావడం డౌటే. ఎందుకంటే.. ఈ సినిమాలో కొంతమంది యూరోపియన్ నటులు నటిస్తున్నారు. కరోనా ఆంక్షల కారణంగా వాళ్లు ఇండియాకు రావడం ప్రస్తుతానికి సాధ్యం కాదు.

మరోవైపు ఆర్ఆర్ఆర్ గ్రాఫిక్స్ చేస్తున్న కొన్ని విదేశీ సంస్థలు, ఈ సంక్షోభం కారణంగా మూతపడ్డాయట. కొత్తగా మరో కంపెనీని వెదుక్కొని వాళ్లతో గ్రాఫిక్స్ చేయించడానికి అదనంగా మరో 3-4 నెలల సమయం పడుతుందంటున్నారు. ఈ కారణాల రీత్యా ఆర్ఆర్ఆర్ సినిమా జనవరి 8కి రిలీజ్ కావడం డౌటే అంటున్నారు జనాలు. దీనిపై రాజమౌళి ఇంకా రియాక్ట్ అవ్వలేదు.

First Published:  11 April 2020 5:20 AM GMT
Next Story