Telugu Global
Cinema & Entertainment

పవన్ సరసన బాలీవుడ్ బ్యూటీ

క్రిష్ సినిమాకు సంబంధించిన మేటర్ ఇది. వకీల్ సాబ్ తో పాటు సైమల్టేనియస్ గా ఈ సినిమా కూడా చేస్తున్నాడు పవన్. వకీల్ సాబ్ లో హీరోయిన్ ఎలాగైతే ఫిక్స్ అవ్వలేదో, ఈ సినిమాలో కూడా హీరోయిన్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు. అయితే తన సినిమాలో హీరోయిన్ కు సంబంధించి క్రిష్ కు కొన్ని ఆలోచనలు ఉన్నాయి. పవన్ తో చేస్తున్న సినిమాను పాన్-ఇండియా మూవీగా మలచాలనేది క్రిష్ ఆలోచన. ఇదొక పీరియాడిక్ మూవీ కాబట్టి అన్ని […]

పవన్ సరసన బాలీవుడ్ బ్యూటీ
X

క్రిష్ సినిమాకు సంబంధించిన మేటర్ ఇది. వకీల్ సాబ్ తో పాటు సైమల్టేనియస్ గా ఈ సినిమా కూడా చేస్తున్నాడు పవన్. వకీల్ సాబ్ లో హీరోయిన్ ఎలాగైతే ఫిక్స్ అవ్వలేదో, ఈ సినిమాలో కూడా హీరోయిన్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు. అయితే తన సినిమాలో హీరోయిన్ కు సంబంధించి క్రిష్ కు కొన్ని ఆలోచనలు ఉన్నాయి.

పవన్ తో చేస్తున్న సినిమాను పాన్-ఇండియా మూవీగా మలచాలనేది క్రిష్ ఆలోచన. ఇదొక పీరియాడిక్ మూవీ కాబట్టి అన్ని భాషలకు సెట్ అవుతుందని అనుకుంటున్నాడు. పైగా క్రిష్ కు బాలీవుడ్ కనెక్ట్ కూడా ఉంది కాబట్టి ఈ సినిమాను సౌత్ లాంగ్వేజెస్ తో పాటు హిందీలో కూడా రిలీజ్ చేయాలనేది అతడి ప్లాన్. అందుకే హీరోయిన్ గా బాలీవుడ్ భామను తీసుకునే ఆలోచనలో ఉన్నాడట. ఈ క్రమంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పేరు తెరపైకొచ్చింది.

మొన్నటివరకు ఈ సినిమా కోసం ప్రగ్యాజైశ్వాల్, లావణ్య త్రిపాఠి పేర్లు వినిపించాయి. ఎప్పుడైతే పాన్-ఇండియాగా సినిమాను మార్చాలని అనుకున్నారో, అప్పుడే హీరోయిన్ల పేర్లు కూడా మారిపోయాయి. ఇందులో భాగంగానే జాక్వెలిన్ పేరు తెరపైకొచ్చింది.

అన్నట్టు కేవలం పాన్-ఇండియా అప్పీల్ కోసమే ఇంతకుముందు అనుకున్న విరూపాక్ష అనే టైటిల్ ను వదులుకున్నారట మేకర్స్. అన్ని భాషల్లో కనెక్ట్ అయ్యే మరో టైటిల్ కోసం వెదుకుతున్నారు.

First Published:  11 April 2020 5:23 AM GMT
Next Story