Telugu Global
NEWS

లోకల్ ట్రాన్స్‌మిషన్‌ లేదు.... కేసులు తగ్గుతాయన్న ఈటల

తెలంగాణలో గురువారం కేవలం 18 కరోనా పాజిటివ్‌ కేసులు మాత్రమే బయటపడ్డాయి. ఒకేరోజు పెద్ద ఎత్తున 665 కరోనా టెస్టులు నిర్వహించారు. కేవలం 18 మందికి మాత్రమే పాజిటివ్‌రావడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 471కి చేరింది. ఇందులో మర్కజ్‌ వాటా 388. ఇప్పటివరకూ 12 మంది చనిపోయారు. తెలంగాణలో ఇప్పటివరకూ పాజిటివ్‌ కేసులన్నీ బయటినుంచి వచ్చినవే. వారికి దగ్గరగా ఉన్నవారికే వ్యాప్తిచెందింది. లోకల్‌ ట్రాన్స్‌మిషన్‌ జరగడం లేదని ఆరోగ్య శాఖమంత్రి ఈటల […]

లోకల్ ట్రాన్స్‌మిషన్‌ లేదు.... కేసులు తగ్గుతాయన్న ఈటల
X

తెలంగాణలో గురువారం కేవలం 18 కరోనా పాజిటివ్‌ కేసులు మాత్రమే బయటపడ్డాయి. ఒకేరోజు పెద్ద ఎత్తున 665 కరోనా టెస్టులు నిర్వహించారు. కేవలం 18 మందికి మాత్రమే పాజిటివ్‌రావడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 471కి చేరింది. ఇందులో మర్కజ్‌ వాటా 388. ఇప్పటివరకూ 12 మంది చనిపోయారు.

తెలంగాణలో ఇప్పటివరకూ పాజిటివ్‌ కేసులన్నీ బయటినుంచి వచ్చినవే. వారికి దగ్గరగా ఉన్నవారికే వ్యాప్తిచెందింది. లోకల్‌ ట్రాన్స్‌మిషన్‌ జరగడం లేదని ఆరోగ్య శాఖమంత్రి ఈటల రాజేందర్‌ చెప్పారు. విదేశాల నుంచి వచ్చినవాళ్లు….మర్కజ్‌ వెళ్లి వచ్చినవారి వల్లే పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి నుంచి కేసుల సంఖ్య క్రమంగా తగ్గే అవకాశం ఉందని చెప్పారు. ఏప్రిల్‌ 24 వరకు పాజిటివ్‌ పేషేంట్లు కూడా కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యే చాన్స్‌ ఉందని వివరించారు.

కరోనా పాజిటివ్ పేషెంట్లలో ఇప్పటికే 45 మంది డిశ్చార్జి అయ్యారని తెలిపారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారిలో అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని.. కేవలం ఒక్కరు మాత్రమే వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారని చెప్పారు.

మర్కజ్ వెళ్లి వచ్చినవారిని.. వారిని కలిసినవారిని దాదాపుగా గుర్తించి క్వారెంటైన్ చేశామని… కాబట్టి కొత్తగా వచ్చే పాజిటివ్ కేసుల సంఖ్య తక్కువగానే ఉండవచ్చునని అన్నారు. అలా అని ప్రజలు తేలిగ్గా తీసుకోవడానికి లేదని.. ఇంతకుముందు ఎలాంటి నిబద్దతతో లాక్ డౌన్ పాటించారో… ఇప్పుడు కూడా అదే నిబద్దతతను కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.

మర్కజ్ కేసులు రావడం, లాక్ డౌన్ ప్రకటించడం రెండూ ఒకే సమయంలో జరిగాయి కాబట్టే పాజిటివ్ కేసులు అదుపులో ఉన్నాయని చెప్పారు. వైరస్ వ్యాప్తికి అవకాశం ఉండే 101 హాట్ స్పాట్లను గుర్తించి.. ఆయా ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకోబోతున్నట్టు చెప్పారు. ఆ ప్రాంతాల్లో నిత్యావసరాలను కూడా అధికారులే ఇళ్ల వద్దకు పంపిణీ చేస్తారని చెప్పారు.

First Published:  9 April 2020 9:04 PM GMT
Next Story