Telugu Global
NEWS

తెలంగాణలో మాస్కులు తప్పనిసరి చేస్తూ కీలక నిర్ణయం

కరోనా వైరస్ తీవ్రత రోజురోజుకూ పెరగుతుండడంతో పలు ప్రభుత్వాలు లాక్ డౌన్ నిబంధనలు కఠినతరం చేస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలో మాస్క్ ధరించడం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇళ్ల నుంచి బయటకు వచ్చే వాళ్లు కచ్చితంగా మాస్క్ ధరించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కరోనా వైరస్ సోకిన వారికి దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. కాగా ప్రస్తుతం ఎలాంటి లక్షణాలు లేకుండానే కరోనా పాజిటీవ్‌గా నిర్థారణ అవుతున్న […]

తెలంగాణలో మాస్కులు తప్పనిసరి చేస్తూ కీలక నిర్ణయం
X

కరోనా వైరస్ తీవ్రత రోజురోజుకూ పెరగుతుండడంతో పలు ప్రభుత్వాలు లాక్ డౌన్ నిబంధనలు కఠినతరం చేస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలో మాస్క్ ధరించడం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇళ్ల నుంచి బయటకు వచ్చే వాళ్లు కచ్చితంగా మాస్క్ ధరించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

కరోనా వైరస్ సోకిన వారికి దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. కాగా ప్రస్తుతం ఎలాంటి లక్షణాలు లేకుండానే కరోనా పాజిటీవ్‌గా నిర్థారణ అవుతున్న వారి కేసులు పెరుగుతున్నాయి. వైరస్ సోకినా చాలా మందికి ఆ లక్షణాలు కనపడవని.. అలాంటి వారితో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని ప్రభుత్వం అంటోంది.

కాబట్టి ప్రజలు సాధ్యమైనంతగా, వైరస్ సోకకుండా…. రక్షణ చర్యలు తీసుకోవడమే సరైన మార్గమని అధికారులు అంటున్నారు. ఆఫీసులు, పని చేసే ప్రాంతాల్లో తప్పని సరిగా మాస్కులు ఉపయోగించాలని.. మాస్కులు లేకుంటే రెండు పొరలు ఉండే కాటన్ వస్త్రాన్ని మొఖానికి చుట్టుకోవచ్చని ప్రభుత్వం పేర్కొంది.

అర్బన్ ప్రాంతాల్లోనే కాకుండా ఈ ఉత్తర్వులు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కూడా వర్తిస్తాయని స్పష్టం చేశారు. గ్రామాల్లో ప్రజలు తప్పక మొఖానికి అడ్డుగా మాస్క్ లేదా కాటన్ వస్త్రాన్ని ధరించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. లాక్‌డౌన్ సమయంలో నిబంధనలు ఉల్లంఘించి మాస్కులు ధరించకుండా బయటకు వస్తే కఠిన చర్యలు తప్పవని తెలంగాణ ప్రభుత్వం హెచ్చరిస్తోంది.

First Published:  10 April 2020 6:50 AM GMT
Next Story