Telugu Global
Cinema & Entertainment

యంగ్ హీరోయిన్ కు షాకిచ్చిన హ్యాకర్స్

మలయాళ ముద్దుగుమ్మ.. తెలుగులో కూడా నటించిన హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కు హ్యాకర్స్ గట్టి షాక్ ఇచ్చారు. ప్రేమమ్ తో మలయాళంలో కుర్రకారు మదిని దోచిన ఈ ముద్దగుమ్మ తెలుగులోనూ మంచి చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇక సినిమాల్లోనే కాదు.. సోషల్ మీడియాలోనూ అనుపమ యాక్టివ్ గా ఉంటుంది. తన చుట్టూ జరిగిన విశేషాలు, కుటుంబంలో జరిగిన సరదా సన్నివేశాలను పోస్టు చేస్తూ అభిమానులను అలరిస్తుంటుంది. తన లేటెస్ట్ పిక్స్, ఫొటో షూట్ లను కూడా సోషల్ […]

యంగ్ హీరోయిన్ కు షాకిచ్చిన హ్యాకర్స్
X

మలయాళ ముద్దుగుమ్మ.. తెలుగులో కూడా నటించిన హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కు హ్యాకర్స్ గట్టి షాక్ ఇచ్చారు. ప్రేమమ్ తో మలయాళంలో కుర్రకారు మదిని దోచిన ఈ ముద్దగుమ్మ తెలుగులోనూ మంచి చిత్రాల్లో నటించి మెప్పించింది.

ఇక సినిమాల్లోనే కాదు.. సోషల్ మీడియాలోనూ అనుపమ యాక్టివ్ గా ఉంటుంది. తన చుట్టూ జరిగిన విశేషాలు, కుటుంబంలో జరిగిన సరదా సన్నివేశాలను పోస్టు చేస్తూ అభిమానులను అలరిస్తుంటుంది. తన లేటెస్ట్ పిక్స్, ఫొటో షూట్ లను కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటుంది.

తాజాగా దేశమంతా లాక్ డౌన్ వేళ ఇంటికే పరిమితమైంది అనుపమ పరమేశ్వరన్. సోషల్ మీడియాలో తన విశేషాలు పోస్టు చేస్తూ కాలం గడుపుతోంది. అయితే తాజాగా హ్యాకర్లు అనుపమకు గట్టి షాక్ ఇచ్చారు.

అనుపమ పరమేశ్వరన్ ఫేస్ బుక్ పేజీ హ్యాక్ అయ్యింది. ఈ విషయాన్ని గ్రహించిన అనుపమా తన పేజీ హ్యాక్ అయ్యిందని తను చెప్పేవరకు ఈ పేజీలో వచ్చిన మెసేజ్ లను పట్టించుకోవద్దని అభిమానులను కోరింది. ఈ మేసేజ్ చేసిన కొద్ది సేపటికే అనుపమ పేజ్ డిలీట్ అయిపోయింది. దీంతో హ్యాకర్లు చేసిన మాయతో అనుపమ పేజీ రికవరీ అవుతుందా? లేదా మళ్లీ కొత్తది క్రియేట్ చేస్తారో చూడాలి.

First Published:  10 April 2020 3:10 AM GMT
Next Story