Telugu Global
International

కరోనా బాధితుల సహాయనిధికి భారత్-పాక్ మ్యాచ్?

ప్రతిపాదించిన పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ కరోనా వైరస్ మహమ్మారితో ఉక్కిరిబిక్కిరవుతున్న దాయాది దేశాలు భారత్, పాకిస్థాన్ పలురకాల సమస్యలు ఎదుర్కొంటున్నాయి. భారత్ తో పోల్చుకొంటే.. ఉగ్రవాదుల అడ్డా పాకిస్థాన్ భరించలేని సమస్యలతో దిక్కుతోచని స్థితిలో కూరుకుపోయింది. ఓ వైపు 130 కోట్ల జనాభా కలిగిన అతిపెద్దదేశం భారత్ 21 రోజుల లాక్ డౌన్ ను సమర్థవంతంగా అమలు చేస్తూనే … కరోనా వైరస్ ను నివారించడానికి పోరాటం చేస్తుంటే… మరోవైపు పాక్ ప్రభుత్వం మాత్రం నిధుల లేమితో చేతులెత్తేసింది. […]

కరోనా బాధితుల సహాయనిధికి భారత్-పాక్ మ్యాచ్?
X
  • ప్రతిపాదించిన పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్

కరోనా వైరస్ మహమ్మారితో ఉక్కిరిబిక్కిరవుతున్న దాయాది దేశాలు భారత్, పాకిస్థాన్ పలురకాల సమస్యలు ఎదుర్కొంటున్నాయి. భారత్ తో పోల్చుకొంటే.. ఉగ్రవాదుల అడ్డా పాకిస్థాన్ భరించలేని సమస్యలతో దిక్కుతోచని స్థితిలో కూరుకుపోయింది.

ఓ వైపు 130 కోట్ల జనాభా కలిగిన అతిపెద్దదేశం భారత్ 21 రోజుల లాక్ డౌన్ ను సమర్థవంతంగా అమలు చేస్తూనే … కరోనా వైరస్ ను నివారించడానికి పోరాటం చేస్తుంటే… మరోవైపు పాక్ ప్రభుత్వం మాత్రం నిధుల లేమితో చేతులెత్తేసింది. కరోనా వైరస్ ను ఎలా నివారించాలో తెలియక, అన్నార్తులకు వైద్య, ఆహార సదుపాయాలు కల్పించలేక చేష్టలుడిగి చూస్తోంది.

పాక్ లోని మైనార్టీ క్రికెటర్లను పాక్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోడంతో…భారత మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్ ల సాయాని… పాక్ మైనార్టీ క్రికెటర్ డానిష్ కనేరియా అర్థించక తప్పలేదు.

పాక్ మాజీ కెప్టెన్ షాహీద్ అఫ్రిదీ నిర్వహిస్తున్న ఓ ట్రస్టు ద్వారా పంజాబీ క్రికెటర్ల జోడీ యువీ-హర్భజన్ తమవంతు సాయం అందిస్తున్నారు.

మరోవైపు…భారత్-పాక్ ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాలు స్తంభించిపోయిన నేపథ్యంలో…రెండుజట్ల మధ్య ఓ సహాయక క్రికెట్ మ్యాచ్ నిర్వహించాలంటూ… మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ప్రతిపాదించాడు.

దుబాయ్ లాంటి తటస్థ వేదికలో …ప్రత్యేక విమానాలను ఉపయోగించడం ద్వారా…రెండుజట్ల మధ్య మూడుమ్యాచ్ ల సిరీస్ ను నిర్వహించడం ద్వారా వచ్చిన ఆదాయాన్ని సాయంగా అందించాలని, పాకిస్థాన్ కు భారత్ 10వేల వెంటిలేటర్లను సమకూర్చగలిగితే… రుణపడి ఉంటామని 44 సంవత్సరాల షోయబ్ అక్తర్ తెలిపాడు.

ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాక్ ప్రభుత్వం… కరోనా కట్టడికి ఏమాత్రం ప్రయత్నించకుండా ప్రపంచ దేశాల సాయం కోసం ఎదురుచూస్తోంది.

First Published:  8 April 2020 9:15 AM GMT
Next Story