ఫేక్ న్యూస్ కట్టడికి వాట్సాప్ కొత్త ఫీచర్
కరోనా వైరస్‌పై ఇప్పుడు వాట్సాప్‌లో మేసేజ్‌ల మీద మేసేజ్‌లు ఫార్వార్డ్ అవుతున్నాయి. ఇందులో తప్పుడు సమాచారం కూడా ఎక్కువే. ఎంతోమంది తమకు తెలిసిన విషయాలను వాట్సాప్‌లో డంప్ చేస్తున్నారు. తమకు వచ్చిన నకిలీ మేసేజ్‌లను పరిశీలించడం లేదు… వాటిని కూడా అందరికీ ఫార్వార్డ్ చేస్తున్నారు. ఇలా కుప్పలు తెప్పలుగా ఫేక్ మేసేజ్‌లు ఫార్వార్డ్ అవుతున్నాయి. దీంతో ఇప్పుడు ఈ ఫేక్ న్యూస్ ల కట్టడికి వాట్సాప్ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. ఇప్పటి వరకు ఒకరు ఒక మేసేజ్‌ను […]

కరోనా వైరస్‌పై ఇప్పుడు వాట్సాప్‌లో మేసేజ్‌ల మీద మేసేజ్‌లు ఫార్వార్డ్ అవుతున్నాయి. ఇందులో తప్పుడు సమాచారం కూడా ఎక్కువే. ఎంతోమంది తమకు తెలిసిన విషయాలను వాట్సాప్‌లో డంప్ చేస్తున్నారు. తమకు వచ్చిన నకిలీ మేసేజ్‌లను పరిశీలించడం లేదు… వాటిని కూడా అందరికీ ఫార్వార్డ్ చేస్తున్నారు. ఇలా కుప్పలు తెప్పలుగా ఫేక్ మేసేజ్‌లు ఫార్వార్డ్ అవుతున్నాయి.
దీంతో ఇప్పుడు ఈ ఫేక్ న్యూస్ ల కట్టడికి వాట్సాప్ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. ఇప్పటి వరకు ఒకరు ఒక మేసేజ్‌ను ఐదుగురికి ఫార్వర్డ్ చేసే అవకాశం ఉండేది.
అయితే ఇప్పుడు ఈ నిబంధనను కూడా మరింత కఠినతరం చేయబోతోంది వాట్సాప్ సంస్థ. ఇక ఇప్పటి నుంచి ఒక మెసేజ్ ను కేవలం ఒక్క వక్తికి గానీ లేకపోతే ఒక్క గ్రూప్ కు మాత్రమే ఫార్వర్డ్ చేసేలా నిబంధనను మార్చబోతోంది. దీంతో వాట్సాప్ లో ఎక్కువగా వ్యాప్తి చెందే ఫేక్ న్యూస్ లకు అడ్డుకట్ట వేయవచ్చని వాట్సాప్ భావిస్తోంది.
ఇక తమకు వచ్చిన మేసేజ్ నిజమైందో కాదో తెలుసుకోవడానికి ఇంకో ఫీచర్ ప్రవేశపెట్టాలని వాట్సాప్ చూస్తోంది. మేసేజ్‌ను ఇంటర్నెట్‌లో చెక్ చేసుకునే సెర్చ్ చేసే ఆప్షన్ కూడా ఇవ్వాలని అనుకుంటోంది. తమకు వచ్చిన మెసేజ్ ని వేరే వారికి ఫార్వర్డ్ చేసే ముందు దీని ద్వారా మరో సారి చెక్ చేసుకుంటే పుకార్లకు చెక్ పెట్టవచ్చని వాట్సాప్ విశ్వసిస్తోంది.