ఎన్నాళ్లకెన్నాళ్లకు.... కవిత వచ్చింది....
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చేతిలో ఘోరంగా ఓడిపోయిన కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత ఆ తర్వాత యాక్టివ్ పాలిటిక్స్ నుంచి వైదొలిగింది. రాజకీయాలకు దూరంగా మౌనంగా ఉండిపోయారు. టీఆర్ఎస్ ను ఏమాత్రం పట్టించుకోకుండా ఇంటికే పరిమితమయ్యారు. కవిత ఓటమి తర్వాత నిజామాబాద్ ను పూర్తిగా విడిచిపెట్టారు. నియోజకవర్గాన్ని సందర్శించనూ కూడా లేదు. నిజామాబాద్ కు చెందిన పార్టీ కార్యకర్తలను కూడా ఆమె కలవలేదు. కానీ ఇప్పుడు ఆమె నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా […]
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చేతిలో ఘోరంగా ఓడిపోయిన కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత ఆ తర్వాత యాక్టివ్ పాలిటిక్స్ నుంచి వైదొలిగింది. రాజకీయాలకు దూరంగా మౌనంగా ఉండిపోయారు. టీఆర్ఎస్ ను ఏమాత్రం పట్టించుకోకుండా ఇంటికే పరిమితమయ్యారు.
కవిత ఓటమి తర్వాత నిజామాబాద్ ను పూర్తిగా విడిచిపెట్టారు. నియోజకవర్గాన్ని సందర్శించనూ కూడా లేదు. నిజామాబాద్ కు చెందిన పార్టీ కార్యకర్తలను కూడా ఆమె కలవలేదు. కానీ ఇప్పుడు ఆమె నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికవుతున్నారు. దీంతో తిరిగి తాజాగా నిజామాబాద్ కు సంవత్సరం తర్వాత చేరుకోవడం విశేషంగా మారింది.
పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తర్వాత దాదాపు సంవత్సరం తరువాత కవిత నిజామాబాద్ లో అడుగుపెట్టారు. కరోనాతో లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న పేద ప్రజలకు నిజామాబాద్ లో ఆహార పొట్లాలను కవిత పంపిణీ చేశారు. జగిత్యాలలోనూ పర్యటించి పేదలకు అన్నదానం చేశారు… స్థానిక నేతలతో కలిసి ఆహార పంపిణీ కేంద్రాలను ప్రారంభించారు.
ఓటమి తర్వాత సైలెంట్ గా ఉన్న కవిత.. తాజాగా చాలా రోజుల తర్వాత నిజామాబాద్ పాలిటిక్స్ లో యాక్టివ్ కావడంపై గులాబీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ను ధీటుగా ఎదుర్కొనే సత్తా కవితకే ఉందని.. వచ్చే ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేయాలని భావిస్తున్నారు.
ఇక ఓటమితో కృంగిపోవద్దని.. నిజామాబాద్ లో మరింత చురుకుగా ఉండాలని కవితను సీఎం కేసీఆర్ కోరినట్లు సమాచారం. దూకుడైన అరవింద్ కు కౌంటర్ ఇవ్వాలంటే ప్రజల్లోకి వెళ్లాలని సూచించినట్టు తెలిసింది. దీంతో కవిత కూడా మనసు మార్చుకొని ప్రజాక్షేత్రంలోకి దిగినట్టు తెలుస్తోంది.