Telugu Global
National

మోదీ 'చిరు' సందేశం... ఆ నలుగురిపై ప్రశంసల వర్షం

ప్రధాని మోదీ.. టాలీవుడ్ ను ‘టచ్’ చేశారు. జనాన్ని ఆకట్టుకునే ఏ విషయంపై అయినా సోషల్ మీడియాలో స్పందించే ఆయన.. రీసెంట్ గా టాలీవుడ్ నుంచి విడుదలైన కరోనా పాటపై స్పందించారు. సీనియర్ హీరోలు చిరంజీవి, నాగార్జున.. యువ నటులు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ లు కలిసి ఈ పాటలో నటించారు. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి.. ఈ పాటకు స్వర కల్పన చేశారు. కరోనాను ఎదుర్కోవడంలో భాగంగా జనాన్ని అప్రమత్తం చేస్తూ ఈ […]

మోదీ చిరు సందేశం... ఆ నలుగురిపై ప్రశంసల వర్షం
X

ప్రధాని మోదీ.. టాలీవుడ్ ను ‘టచ్’ చేశారు. జనాన్ని ఆకట్టుకునే ఏ విషయంపై అయినా సోషల్ మీడియాలో స్పందించే ఆయన.. రీసెంట్ గా టాలీవుడ్ నుంచి విడుదలైన కరోనా పాటపై స్పందించారు. సీనియర్ హీరోలు చిరంజీవి, నాగార్జున.. యువ నటులు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ లు కలిసి ఈ పాటలో నటించారు. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి.. ఈ పాటకు స్వర కల్పన చేశారు.

కరోనాను ఎదుర్కోవడంలో భాగంగా జనాన్ని అప్రమత్తం చేస్తూ ఈ పాటను షూట్ చేశారు. ప్రజల నుంచి ఆయా హీరోల అభిమానుల నుంచి ఈ పాటకు మంచి స్పందనే వచ్చింది. ఈ ప్రయత్నం ఏకంగా… ప్రధాని మోదీ దృష్టిని ఆకర్షించింది. వెంటనే స్పందించిన ఆయన.. తెలుగులో ట్వీట్ చేయడం అందరినీ ఆకర్షించింది. “చిరంజీవి, నాగార్జున, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్.. మీరందరూ ఇచ్చిన అతి చక్కని సందేశానికి ధన్యవాదాలు. అందరం మన ఇళ్లలోనే ఉందాం. సామాజిక దూరం పాటిద్దాం. కరోనా వైరస్ పై విజయం సాధిద్దాం” అంటూ ట్వీట్ చేశారు.

మోదీ స్పందనకు చిరంజీవి ప్రతిస్పందించారు. ధన్యవాదాలు తెలిపారు. కరోనాను కట్టడి చేసేందుకు ప్రధానిగా నిర్విరామంగా కృషి చేస్తున్నారంటూ ప్రధానిని అభినందించారు. ఇలాంటి మహా కార్యంలో తమవంతుగా చిన్న సాయం మాత్రమే చేశామంటూ చెప్పుకొచ్చారు. సంగీత దర్శకుడు కోటితో పాటు.. తమ అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు.

ఈ చర్యతో జాతీయ స్థాయిలో మన టాలీవుడ్ నటులు చర్చకు తెర తీశారు. ఇతర భాషా సినీ పరిశ్రమల పెద్దలు కరోనా నివారణ చర్యలపై అంతంత మాత్రంగానే స్పందిస్తున్న తరుణంలో భారీ ఎత్తున విరాళాలు సేకరించడం.. కేంద్రానికి బాసటగా నిలవడం.. ప్రతిగా ప్రధాని స్పందించడం.. ఇవన్నీ రాజకీయాలకు అతీతంగా ప్రశంసించదగినవి కాబట్టే.. మంచి స్పందన అంటుకున్నారు.

First Published:  4 April 2020 1:26 AM GMT
Next Story