Telugu Global
International

క్రికెటర్లు తప్పు చేస్తే ఉరి తీయాలి

పాక్ క్రికెట్ దిగ్గజం మియాందాద్ డిమాండ్ పాకిస్థాన్ క్రికెట్లో గత దశాబ్దకాలంగా చోటు చేసుకొంటున్న పరిణామాల పట్ల మాజీ కెప్టెన్, క్రికెట్ దిగ్గజం జావేద్ మియాందాద్ విచారం వ్యక్తం చేశాడు. డబ్బు కోసం పలువురు క్రికెటర్లు అడ్డదారులు తొక్కడం, సస్పెన్షన్ పూర్తయిన తర్వాత తిరిగి జట్టులో చేరడం ఆందోళన కలిగిస్తోందని వాపోయాడు. పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్ తో పాటు…పలు అంతర్జాతీయ సిరీస్ ల్లో పాల్గొన్న పలువురు పాక్ క్రికెటర్లు స్పాట్ ఫిక్సింగ్, మ్యాచ్ ఫిక్సింగ్ లకు పాల్పడటం, విచారణ […]

క్రికెటర్లు తప్పు చేస్తే ఉరి తీయాలి
X
  • పాక్ క్రికెట్ దిగ్గజం మియాందాద్ డిమాండ్

పాకిస్థాన్ క్రికెట్లో గత దశాబ్దకాలంగా చోటు చేసుకొంటున్న పరిణామాల పట్ల మాజీ కెప్టెన్, క్రికెట్ దిగ్గజం జావేద్ మియాందాద్ విచారం వ్యక్తం చేశాడు. డబ్బు కోసం పలువురు క్రికెటర్లు అడ్డదారులు తొక్కడం, సస్పెన్షన్ పూర్తయిన తర్వాత తిరిగి జట్టులో చేరడం ఆందోళన కలిగిస్తోందని వాపోయాడు.

పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్ తో పాటు…పలు అంతర్జాతీయ సిరీస్ ల్లో పాల్గొన్న పలువురు పాక్ క్రికెటర్లు స్పాట్ ఫిక్సింగ్, మ్యాచ్ ఫిక్సింగ్ లకు పాల్పడటం, విచారణ తర్వాత దోషులుగా తేలడం, ఏడాది లేదా రెండేళ్ల నిషేధం తర్వాత పలుకుబడి ఉపయోగించి తిరిగి జట్టులో చేరడం దేనికి సంకేతమని ప్రశ్నించాడు.

తప్పుచేసిన క్రికెటర్లను ఉరితీయకలిగితేనే పాక్ క్రికెట్ ను ప్రక్షాళన చేయగలమని… ఓఇంటర్వ్యూలో చెప్పాడు.

అడ్డదారులు తొక్కడం, నమ్మకద్రోహం చేయడం, తల్లిదండ్రులకు, మాతృదేశానికి తలవంపులు తీసుకువచ్చినవారిని ఇస్లాం క్షమించదని, దోషులను ఉరితీయమని తమ మతం చెప్పకపోయినా… మరొకరు తప్పు చేయకుండా ఉండాలంటే ఉరి మినహా వేరే దారిలేదని జావేద్ అభిప్రాయపడ్డాడు.

పీసీబీ మెతకవైఖరితో నష్టం…

పాకిస్థాన్ క్రికెట్ ను స్పాట్ ఫిక్సింగ్…ఓ వైరస్ లా పట్టి పీడిస్తోందని, దీనికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మెతకవైఖరే కారణమని 124 టెస్టులు ఆడిన అపార అనుభవం ఉన్న జావేద్ చెప్పాడు.

దోషులుగా తేలిన పాక్ క్రికెటర్లకు ఎలాంటి శిక్షలు విధించాలన్న చర్చలో మాజీ కెప్టెన్లు మహ్మద్ హఫీజ్, షాహీద్ అఫ్రిదీ సైతం పాల్గొన్నారు. క్రికెట్ ఆట తల్లిలాంటిదని, నైపుణ్యం, సత్తా చాటుకోడం ద్వారా సంపాదించుకోవాలి కానీ, తల్లినే అమ్మకానికి పెట్టి అడ్డదారిలో సంపాదన కోసం అర్రులు చాచే నమ్మకద్రోహ ఆటగాళ్లను ఏం చేయాలని జావేద్ ప్రశ్నించాడు.

తప్పు చేయడం, శిక్ష అనుభవించడం, పరిచయాలు, పలుకుబడిని ఉపయోగించి తిరిగి జట్టులో చేరడం… ఇదేమి న్యాయం, ఇది దేనికి సంకేతమని జావేద్ నిలదీశాడు.

స్పాట్ ఫిక్సింగ్ దోషిగా శిక్ష అనుభవించి…తిరిగి జట్టులో చేరటానికి ప్రయత్నిస్తున్న షర్జీల్ ఖాన్ కు మరో అవకాశం ఇవ్వరాదని మహ్మద్ హఫీజ్ అభిప్రాయపడ్డాడు.

అంతేకాదు…తనను స్పాట్ ఫిక్సింగ్ చేయమని బుకీలు కోరిన విషయాన్ని పాక్ క్రికెట్ బోర్డుకు తెలపకుండా దాచిపెట్టిన ఉమర్ అక్మల్ పై 12 మాసాల నిషేధం విధించడం తో పాటు…భారీ జరిమానా సైతం విధించారు.

పాక్ క్రికెట్ పాలిట కరోనా వైరస్ లాంటి స్పాట్ ఫిక్సింగ్ ను రూపుమాపాలంటే…మానవత్వం అనేది చూపకుండా…దోషులుగా తేలిన క్రికెటర్లను ఉరితీస్తే… మరొకరు ఇలాంటి తప్పు చేయటానికి భయపడతారని జావేద్ మియాందాద్ అభిప్రాయపడ్డాడు.

1992 ప్రపంచకప్ సాధించిన పాక్ జట్టులో జావేద్ మియాందాద్ సైతం కీలక సభ్యుడుగా ఉన్నాడు.

First Published:  3 April 2020 8:24 PM GMT
Next Story