Telugu Global
International

ఇల్లే కదా స్వర్గసీమ అంటున్న క్రికెట్ స్టార్లు

మంచిపనోళ్లు మన క్రికెట్ హీరోలు భార్యతో హెయిర్ కటింగ్ చేయించుకొన్నకొహ్లీ గుర్రపుస్వారీతో జడేజా బిజీబిజీ టాయిలెట్లు కడుగుతూ శిఖర్ ధావన కరోనా వైరస్ దెబ్బతో 21 రోజుల దేశవ్యాప్త లాక్ డౌన్ లో మొదటి 10 రోజుల కాలం.. భారంగా, చిత్రంగా, విచిత్రంగా ముగిసిపోయింది. మిగిలిన కాలాన్ని ఎలా గడపాలా అంటూ సామాన్యులు ఓ వైపు ఉక్కిరిబిక్కిరవుతుంటే… మరోవైపు… మన క్రికెట్ హీరోలకు మాత్రం..లాక్ డౌన్ సమయం అయాచిత వరంలా మారింది. నిత్యం క్రికెట్ సిరీస్ లు, […]

ఇల్లే కదా స్వర్గసీమ అంటున్న క్రికెట్ స్టార్లు
X
  • మంచిపనోళ్లు మన క్రికెట్ హీరోలు
  • భార్యతో హెయిర్ కటింగ్ చేయించుకొన్నకొహ్లీ
  • గుర్రపుస్వారీతో జడేజా బిజీబిజీ
  • టాయిలెట్లు కడుగుతూ శిఖర్ ధావన

కరోనా వైరస్ దెబ్బతో 21 రోజుల దేశవ్యాప్త లాక్ డౌన్ లో మొదటి 10 రోజుల కాలం.. భారంగా, చిత్రంగా, విచిత్రంగా ముగిసిపోయింది. మిగిలిన కాలాన్ని ఎలా గడపాలా అంటూ సామాన్యులు ఓ వైపు ఉక్కిరిబిక్కిరవుతుంటే… మరోవైపు… మన క్రికెట్ హీరోలకు మాత్రం..లాక్ డౌన్ సమయం అయాచిత వరంలా మారింది.

నిత్యం క్రికెట్ సిరీస్ లు, స్వదేశీ, విదేశీ టూర్లతో కుటుంబానికి ఏమాత్రం అందుబాటులో లేని నిన్నటి, నేటితరం క్రికెట్ స్టార్లు మాత్రం ఇంటినే అంటిపెట్టుకొని ఉంటూ… సంసార బాధ్యతలను
నిర్వర్తిస్తూ…ఇల్లే ఇలలో స్వర్గమనీ, ఇల్లాలే దేవతని పాటలు పాడుకొంటూ ఎంచక్కా గడిపేస్తున్నారు.

విరుష్కా స్టయిలే వేరు…!

భారత సెలెబ్రిటీ జోడీ విరాట్ కొహ్లీ, అనుష్కశర్మల స్టయిలే వేరు. కరోనా వైరస్ దెబ్బతో అందరూ ఉపాథికోల్పోయి..ఉసూరుమంటూ ఇంటిపట్టునే ఉండి కాలక్షేఫం చేస్తుంటే…వ్యాపారలక్షణాలు పుష్కలంగా ఉన్న విరుష్కజంట మాత్రం… సోషల్ మీడియా వేదికలు ట్వి్ట్టర్, ఇన్ స్టాగ్రామ్ ల్లో తమ ఫోటోలు పోస్ట్ చేస్తూ కోట్లకు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు.

సోషల్ మీడియాలోని వివిధ వేదికల ద్వారా విరాట్ కొహ్లీకి కోటిమందికి పైగా ఫాలోయర్స్ ఉన్నారు. తమ జోడీ ఒక్కో ఫోటో పోస్ట్ చేసినందుకు విరాట్ కొహ్లీ కోటీ 40 లక్షల రూపాయల వరకూ ఆర్జిస్తున్నాడు.

కరోనా లాక్ డౌన్ కారణంగా తాను బయటకు వెళ్లకుండా ఇంటిలోనే స్వీయనిర్భంధం పాటిస్తున్నాననడానికి నిదర్శనంగా… తన భార్య అనుష్క శర్మతో హెయిర్ కటింగ్
చేయించుకొన్న ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఈ ఫోటోను ఇప్పటికే కోటిమంది అభిమానులు చూసినట్లుగా వార్తలు వచ్చాయి.

గుర్రపుస్వారీ చేస్తూ జడేజా….

భారత డాషింగ్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా..లాక్ డౌన్ సమయాన్ని తాను ప్రాణప్రదంగా భావించే జోడు గుర్రాల ఆలనాపాలనా చూసుకోడమే కాదు… గుర్రపు స్వారీతోనూ సేద తీరుతున్నాడు.

భారత సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ మాత్రం…తన భార్య చెప్పినట్లే వింటూ, హోంమినిస్టర్ ఆదేశాలు పాటిస్తూ…ఎంచక్కా టాయిలెట్లు కడుగుతూ…ఎవరి పనులు వారే చేసుకొంటే తప్పేంటీ అంటున్నాడు. అంతేకాదు తాను టాయిలెట్లు కడిగిన వీడియోను సోషల్ మీడియా ద్వారా అభిమానుల ముందుంచాడు.

కూతురి సేవలో పూజారా, మొక్కలకి నీళ్లు పోస్తూ బుమ్రా

ఇండియన్ క్రికెట్ నయావాల్ చతేశ్వర్ పూజారా…లాక్ డౌన్ పుణ్యమా అంటూ దొరికిన ఖాళీ సమయాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొంటున్నాడు.

రెండేళ్లయినా నిండని కుమార్తె బాగోగులు చూసుకొంటూనే…ఇల్లుతుడవడం, మొక్కలకు నీళ్లు పోయటం లాంటి పనులు చేస్తూ.. .తన భార్య పూజకు తోడునీడగా ఉంటూ వస్తున్నాడు.

యార్కర్ల కింగ్, భారత ఫాస్ట్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా…అమ్మచేతి వంటలు రుచిచూస్తూనే…తన కిష్టమైన గార్డెనింగ్ చేస్తూ గడిపేస్తున్నాడు.

భారత మాజీ క్రికెటర్, కామెంటీటర్ సంజయ్ మంజ్రేకర్ ఇంట్లో కూరగాయలు తరగుతూ తన భార్యకు చేదోడువాదోడుగా ఉంటూ వస్తున్నాడు.

మరో ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ తన పెంపుడు శునకంతో కాలక్షేఫం చేస్తుంటే….మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ…తన గ్యారేజ్ లో ఉన్న విలువైన మోటార్ బైక్ లను శుభ్రం చేస్తూ, ఇంజన్లు కండిషన్ లో ఉన్నాయో లేదో పరీక్షించుకొంటూ గడుపుతున్నాడు.

ఈ క్రికెట్ స్టార్లంతా రోజుకు రెండుగంటలపాటు… ఫిట్ నెస్ కోసం సొంత జిమ్ లలో కండలు కరిగిస్తూనే… మిగిలిన సమయాన్ని ఇంటిపనులకు వినియోగిస్తున్నారు.

మొత్తం మీద…ఆ సిరీస్…ఈ సిరీస్ అంటూ దేశాలు పట్టుకొని తిరిగే క్రికెటర్లు..బుద్ధిగా ఇంటిపట్టునే ఉండడంతో…వారి భార్యపిల్లలు మాత్రం… కరోనా వైరస్ దేవతకు మనసులోనే నమస్కారాలు చెప్పుకొంటూ మురిసిపోతున్నారు.

ఇదంతా చూస్తుంటే ..కరోనా వైరస్ మంచిదే అనుకోక తప్పదేమో మరి.!

First Published:  4 April 2020 1:50 AM GMT
Next Story