Telugu Global
National

మందుబాబులకు సైబర్‌ వల !

లాక్‌డౌన్‌ ఇప్పుడు మందుబాబులకు కష్టాలు తీసుకొచ్చింది. ఒక్కసారిగా లాక్‌డౌన్ ప్రకటించడంతో అన్ని దుకాణాలు మూసివేశారు. ఒక నిత్యావసర సరుకులు అందించే దుకాణాలు మాత్రమే తెరిచి ఉన్నాయి. వైన్‌షాపులు మూతపడ్డాయి. లాక్‌డౌన్‌ ఎఫెక్ట్ తో… అందరూ ఇంట్లో కూర్చొని ఖాళీగా ఉన్నారు. ప్రతిరోజూ మందు తాగడం అలవాటు ఉన్న జనం… దాని కోసం వైన్‌షాపుల చుట్టూ తిరుగుతున్నారు. 90 ఎం.ఎల్‌ అయినా దొరక్కపోదా? అని ఎదురుచూస్తున్నారు. గల్లీలో అక్కడక్కడ అక్రమంగా అమ్మే సెంటర్ల కోసం సెర్చ్‌ చేస్తున్నారు. ఇదే […]

మందుబాబులకు సైబర్‌ వల !
X

లాక్‌డౌన్‌ ఇప్పుడు మందుబాబులకు కష్టాలు తీసుకొచ్చింది. ఒక్కసారిగా లాక్‌డౌన్ ప్రకటించడంతో అన్ని దుకాణాలు మూసివేశారు. ఒక నిత్యావసర సరుకులు అందించే దుకాణాలు మాత్రమే తెరిచి ఉన్నాయి. వైన్‌షాపులు మూతపడ్డాయి.

లాక్‌డౌన్‌ ఎఫెక్ట్ తో… అందరూ ఇంట్లో కూర్చొని ఖాళీగా ఉన్నారు. ప్రతిరోజూ మందు తాగడం అలవాటు ఉన్న జనం… దాని కోసం వైన్‌షాపుల చుట్టూ తిరుగుతున్నారు. 90 ఎం.ఎల్‌ అయినా దొరక్కపోదా? అని ఎదురుచూస్తున్నారు. గల్లీలో అక్కడక్కడ అక్రమంగా అమ్మే సెంటర్ల కోసం సెర్చ్‌ చేస్తున్నారు.

ఇదే అదనుగా ఇప్పుడు కొందరు సైబర్‌ చీటర్స్‌ మందుబాబులకు వల వేస్తున్నారు. వైన్‌షాపుల పేరిట గూగుల్‌లో తమ నెంబర్లు అప్‌లోడ్‌ చేస్తున్నారు. మందును డోర్‌ డెలవరీ ద్వారా సరఫరా చేస్తామని ఆఫర్లు ఇస్తున్నారు. గూగుల్‌లో సెర్చ్‌ చేసి ఈ నెంబర్లకు ఫోన్‌చేస్తే… గంటలో మందు తెచ్చి ఇస్తామని… ఆన్‌లైన్‌ లో పేమెంట్‌ చేయాలని కోరుతున్నారు. డెబిట్‌, క్రెడిట్‌ కార్డు వివరాలు అడిగి బురిడీ కొట్టిస్తున్నారట.

ఇప్పటికే హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసుల దృష్టికి ఒకటి రెండు కేసులు వచ్చాయి. దీంతో ఆన్‌లైన్‌లో లిక్కర్‌ డోర్‌ డెలవరీ చేస్తామని చెప్పేవారిని నమ్మొద్దని సూచిస్తున్నారు. ఆ నెంబర్లకు ఫోన్‌ చేస్తే…మీ అకౌంట్‌ ఖాళీ చేయడంతో పాటు… క్రెడిట్‌, డెబిట్‌ కార్డు వివరాలతో క్లోనింగ్‌ కార్డులు తయారుచేసే అవకాశముందని అంటున్నారు.

ఇక ప్రధానమంత్రి సహాయ నిధి కోసం PMCARES@SBI. అనే యుపీఐ ఐడీ క్రియేట్‌ చేశారు. అయితే ఇదే పేరుతో ఇప్పుడు కొందరు సైబర్‌ నేరగాళ్లు ఫేక్‌ ఐడీలు క్రియేట్‌ చేశారు. ఇవన్నీ ఫేక్ ఐడీలు అని…. జాగ్రత్తగా ఉండమని పోలీసులు సూచించారు.

  • pmcares@pnb
  • pmcares@hdfcbank
  • pmcare@yesbank
  • pmcare@ybl
  • pmcare@upi
  • pmcare@sbi
  • pmcares@icici
First Published:  3 April 2020 11:02 PM GMT
Next Story