Telugu Global
International

భారత్ లో లాక్ డౌన్ పై బీసీజీ సంచలన రిపోర్ట్...

ప్రపంచ ప్రఖ్యాత అమెరికన్ కన్సల్టింగ్ సంస్థ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు (బీసీజీ) బాంబు పేల్చింది. దేశంలో ప్రస్తుతం కరోనా వైరస్ నియంత్రించడానికి కొనసాగుతున్న లాక్ డౌన్ సెప్టెంబర్ నెల వరకు పొడిగించడం ఖాయమని సంచలన రిపోర్టును వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో విస్తరిస్తున్న కరోనా వైరస్ ను చూశాక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఖచ్చితంగా జూన్ వరకు దేశంలో లాక్ డౌన్ కొనసాగిస్తుందని.. జూన్ 4వ వారం నుంచి సెప్టెంబర్ 2వ వారం మధ్య దశలవారీగా భారత దేశంలో […]

భారత్ లో లాక్ డౌన్ పై బీసీజీ సంచలన రిపోర్ట్...
X

ప్రపంచ ప్రఖ్యాత అమెరికన్ కన్సల్టింగ్ సంస్థ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు (బీసీజీ) బాంబు పేల్చింది. దేశంలో ప్రస్తుతం కరోనా వైరస్ నియంత్రించడానికి కొనసాగుతున్న లాక్ డౌన్ సెప్టెంబర్ నెల వరకు పొడిగించడం ఖాయమని సంచలన రిపోర్టును వెల్లడించింది.

ప్రస్తుతం దేశంలో విస్తరిస్తున్న కరోనా వైరస్ ను చూశాక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఖచ్చితంగా జూన్ వరకు దేశంలో లాక్ డౌన్ కొనసాగిస్తుందని.. జూన్ 4వ వారం నుంచి సెప్టెంబర్ 2వ వారం మధ్య దశలవారీగా భారత దేశంలో లాక్ డౌన్ ను ఎత్తివేస్తుందని సంచలన రిపోర్టును బయటపెట్టింది.

దేశ ప్రజల ఆరోగ్య సంరక్షణలో భాగంగా ఆంక్షలను మరికొంత కాలం కొనసాగిస్తుందని బీసీజీ తన నివేదికలో అభిప్రాయపడింది. జూన్ 3వ వారం వరకు దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలిపింది.

బ్రిటన్, పొలాండ్, కొలంబియా వంటి చాలా దేశాలు లాక్ డౌన్ విధించిన తర్వాత… భారత్ లో నరేంద్రమోడీ ప్రభుత్వం మార్చి 24న దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది. ఏప్రిల్ 14వరకు కొనసాగిస్తామని తెలిపింది.

అయితే ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలతో ఏప్రిల్ 3 నాటికి కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో మరికొంత కాలం లాక్ డౌన్ విధించడం ఖాయంగా కనిపిస్తోంది.

First Published:  4 April 2020 12:13 AM GMT
Next Story