Telugu Global
National

వారి వల్లే అత్యధిక కరోనా పాజిటీవ్ కేసులు " ఏపీ గవర్నర్

ప్రస్తుతం దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడికి చర్యలను ముమ్మరం చేశాయి. కేంద్రం లాక్‌డౌన్ విధించడంతో ఆ నిబంధనలు అమలు చేయడంతో పాటు.. కరోనా వ్యాదిగ్రస్తులను గుర్తించి వారికి చికిత్స అందించే పనిలో ఉన్నాయి. కాగా, దేశంలో అమలవుతున్న లాక్‌డౌన్, ప్రభుత్వ చర్యలపై అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల గవర్నర్లతో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌తో పాటు కార్యదర్శి […]

వారి వల్లే అత్యధిక కరోనా పాజిటీవ్ కేసులు  ఏపీ గవర్నర్
X

ప్రస్తుతం దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడికి చర్యలను ముమ్మరం చేశాయి. కేంద్రం లాక్‌డౌన్ విధించడంతో ఆ నిబంధనలు అమలు చేయడంతో పాటు.. కరోనా వ్యాదిగ్రస్తులను గుర్తించి వారికి చికిత్స అందించే పనిలో ఉన్నాయి. కాగా, దేశంలో అమలవుతున్న లాక్‌డౌన్, ప్రభుత్వ చర్యలపై అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల గవర్నర్లతో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌తో పాటు కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా పాల్గొన్నారు.

ఏపీలో గత రెండు, మూడు రోజులుగా అనూహ్యంగా పెరిగిన కరోనా పాజిటీవ్ కేసుల గురించి ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రస్తావించారు. ప్రస్తుతం అనుమానితులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించామని.. వారికి అవసరమైన సేవలు అందిస్తున్నట్లు గవర్నర్ చెప్పారు. కరోనా ప్రభావం మొదలైన తర్వాత విదేశాల నుంచి ఏపీకి 30 వేల మందికి పైగా వచ్చారని.. వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి హోం క్వారంటైన్‌లో ఉండాలనే ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు.

గత రెండు రోజులుగా పాజిటీవ్ కేసులు పెరగడానికి ముఖ్య కారణం ఢిల్లీలో జరిగిన మర్కత్ సమావేశాలేనని చెప్పారు. అక్కడ పాల్గొని వచ్చిన వారివల్లే పాజిటీవ్ కేసులు అనూహ్యంగా పెరిగినట్లు గవర్నర్ వివరించారు. దీంతో వారితో పాటు వారితో తిరిగిన వాళ్లకు, వారి కుటుంబ సభ్యలకు స్క్రీనింగ్ చేశామని.. వైరస్ వ్యాప్తి చెందకుండా క్వారంటైన్ కూడా చేసినట్లు చెప్పారు.

కాగా, ఏపీ పూర్తిగా వ్యవసాయాధార రాష్ట్రం కాబట్టి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు…. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ‌ను కోరారు.

First Published:  3 April 2020 2:47 AM GMT
Next Story