Telugu Global
International

భారతజట్టు ఆస్ట్ర్రేలియా టూరూ అనుమానమే

రాకపోకలపై ఆస్ట్ర్రేలియా 6 మాసాల నిషేధం కరోనావైరస్ కట్టడికి సరిహద్దులు మూసివేత ప్రపంచ దేశాల నుంచి రాకపోకలు ఎక్కువగా ఉండే ద్వీపఖండ దేశం ఆస్ట్ర్రేలియాను సైతం కరోనా వైరస్ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కంగారూల్యాండ్ వ్యాప్తంగా 2వేల మందికి కరోనా వైరస్ సోకగా 16 మంది మరణించడంతో ఆస్ట్ర్రేలియా ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా ఆరుమాసాలపాటు తమ దేశసరిహద్దులను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో..ఆస్ట్ర్రేలియా వేదికగా అక్టోబర్ 18న ప్రారంభం కావాల్సిన 2020 టీ-20 ప్రపంచకప్ తో పాటు.. ఆస్ట్ర్రేలియా-భారతజట్ల మధ్య […]

భారతజట్టు ఆస్ట్ర్రేలియా టూరూ అనుమానమే
X
  • రాకపోకలపై ఆస్ట్ర్రేలియా 6 మాసాల నిషేధం
  • కరోనావైరస్ కట్టడికి సరిహద్దులు మూసివేత

ప్రపంచ దేశాల నుంచి రాకపోకలు ఎక్కువగా ఉండే ద్వీపఖండ దేశం ఆస్ట్ర్రేలియాను సైతం కరోనా వైరస్ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కంగారూల్యాండ్ వ్యాప్తంగా 2వేల మందికి కరోనా వైరస్ సోకగా 16 మంది మరణించడంతో ఆస్ట్ర్రేలియా ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా ఆరుమాసాలపాటు తమ దేశసరిహద్దులను మూసివేస్తున్నట్లు ప్రకటించింది.

దీంతో..ఆస్ట్ర్రేలియా వేదికగా అక్టోబర్ 18న ప్రారంభం కావాల్సిన 2020 టీ-20 ప్రపంచకప్ తో పాటు.. ఆస్ట్ర్రేలియా-భారతజట్ల మధ్య జరగాల్సిన సిరీస్ సైతం అనుమానంగా మారింది.

ఐసీసీ క్యాలెండర్ ప్రకారం భారత జట్టు అక్టోబర్ 18న ప్రారంభమయ్యే టీ-20 ప్రపంచకప్ లో పాల్గొనటానికి ముందే… ఆస్ట్ర్రేలియాతో జరిగే టీ-20 సిరీస్ తో పాటు… నాలుగుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో సైతం పాల్గొనాల్సి ఉంది.

అయితే ..అనుకోని అతిథిలా ప్రపంచాన్ని చుట్టేసి ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కరోనా వైరస్ తో పరిస్థితి ఒక్కసారిగా తారుమారయ్యింది. తమకు క్రీడలకంటే ప్రజల ప్రాణాలే ముఖ్యమని ఆస్ట్ర్రేలియా ప్రభుత్వం భావిస్తూ…ఆరుమాసాలపాటు తమ దేశానికి అంతర్జాతీయ రాకపోకలను నిషేధించింది.

సెప్టెంబర్ తో ఆరుమాసాల గడువు ముగియనుంది. అప్పటికీ కరోనా వైరస్ ముప్పు తొలగి సాధారణ పరిస్థితులు ఏర్పడితే… విమాన టికెట్ల బుకింగ్, ప్రయాణం ఏర్పాట్లు, విడిది సైతం గందరగోళంగా మారే అవకాశం ఉందని బీసీసీఐ అధికారులు భావిస్తున్నారు.

ఏదిఏమైనా… కరోనా వైరస్ తల్లి కరుణిస్తేనే ఆస్ట్ర్రేలియా దేశసరిహద్దులు తెరుచుకోడం, టీ-20 ప్రపంచకప్ తో పాటు… భారతజట్టు పర్యటనకు మార్గం సుగమమయ్యే అవకాశం ఉంది.

First Published:  29 March 2020 11:50 PM GMT
Next Story