Telugu Global
International

కరోనా తీసిన ప్రాణం.... మాంద్యం భయంతో ఆర్థిక మంత్రి బలవన్మరణం

కరోనా వైరస్ ప్రభావం.. ప్రత్యక్షంగానే కాదు. పరోక్షంగానూ మనుషుల ప్రాణాలు బలి తీసుకుంటోంది. నిర్దాక్షిణ్యంగా బలి పశువులను చేస్తోంది. వైరస్ సోకిన వాళ్లు నిత్య నరకం చూస్తుంటే…. భవిష్యత్తు ఎలా ఉంటుందో అన్న భయంతో సాధారణ జనం నుంచి దేశాధినేతల వరకూ వణికిపోయే పరిస్థితి ఏర్పడింది. తాజాగా.. జర్మనీలోని హెస్సీ అనే రాష్ట్రానికి చెందిన ఆర్థిక మంత్రి, 54 ఏళ్ల థామస్ షాఫెర్ బలవన్మరణానికి పాల్పడ్డారు. అంత ఉన్నత స్థాయిలో ఉండి.. పదేళ్లుగా మంత్రిగా విజయవంతంగా బాధ్యతలు […]

కరోనా తీసిన ప్రాణం.... మాంద్యం భయంతో ఆర్థిక మంత్రి బలవన్మరణం
X

కరోనా వైరస్ ప్రభావం.. ప్రత్యక్షంగానే కాదు. పరోక్షంగానూ మనుషుల ప్రాణాలు బలి తీసుకుంటోంది. నిర్దాక్షిణ్యంగా బలి పశువులను చేస్తోంది. వైరస్ సోకిన వాళ్లు నిత్య నరకం చూస్తుంటే…. భవిష్యత్తు ఎలా ఉంటుందో అన్న భయంతో సాధారణ జనం నుంచి దేశాధినేతల వరకూ వణికిపోయే పరిస్థితి ఏర్పడింది. తాజాగా.. జర్మనీలోని హెస్సీ అనే రాష్ట్రానికి చెందిన ఆర్థిక మంత్రి, 54 ఏళ్ల థామస్ షాఫెర్ బలవన్మరణానికి పాల్పడ్డారు.

అంత ఉన్నత స్థాయిలో ఉండి.. పదేళ్లుగా మంత్రిగా విజయవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆ నాయకుడు ఎందుకు ప్రాణాలు తీసుకున్నాడో తెలుసా? కేవలం కరోనా భయం వల్ల. ఈ వైరస్ సృష్టించిన ప్రళయానికి ఇప్పటికే మాంద్యం ముప్పు ఏర్పడింది. ఈ సమస్యను భవిష్యత్తులో ఎలా అధిగమిస్తామో తెలియక.. ఎలాంటి ఇక్కట్లు ఎదురవుతాయో.. వాటికి పరిష్కారం ఎలాగో అన్న ఆందోళనలను చక్కదిద్దుకోలేక.. థామస్ బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారట.

ఈ విషయాన్ని హెస్సీ రాష్ట్ర అధికారులు ధృవీకరించారు. సంక్షోభాన్ని చక్కదిద్దేందుకు అహర్నిశలు పాటుపడిన వ్యక్తి థామస్ అని హెస్సీ అధికారులు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలా జరిగి ఉండాల్సింది కాదని.. నమ్మలేకపోతున్నామని ఆవేదన చెందారు.

కరోనాను చూసి భయపడకండి… వ్యాధి సోకితే నిపుణుల పర్యవేక్షణలో ప్రభుత్వం అందించే చికిత్స తీసుకోండి. అంతేకానీ.. థామస్ లా నిర్ణయాలు తీసుకుని.. మిమ్మల్ని నమ్ముకున్నవాళ్లను ఒంటరి చేయకండి…. అంటూ అక్కడి అధికారులు వేడుకుంటున్నారు.

First Published:  29 March 2020 9:10 PM GMT
Next Story