Telugu Global
NEWS

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులపై కరోనా పిడుగు

కరోనా ముప్పు ఎప్పుడు ఎటు వైపు నుంచి ఎవరి మీద ఎలా ప్రభావం చూపిస్తుందన్నది అర్థం కాకుండా ఉంది. తాజాగా.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన ప్రకారం.. ప్రస్తుతం తెలంగాణ మాత్రమే కాదు. యావత్ దేశం ఆర్థిక సమస్యల్లో చిక్కుకుంది. ఇలాంటి తరుణంలో రాష్ట్రానికి భారమైనా.. రైతులకు అన్యాయం జరగకుండా చూస్తున్నట్టు కేసీఆర్ చెప్పారు. అలాగే.. కరోనా పీడితులకు చికిత్స కోసం భారీగా ఖర్చు చేస్తున్న విషయాన్ని వివరించారు. ఇతర రాష్ట్రాల వారికీ ఆర్థిక సాయం చేయనున్న […]

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులపై కరోనా పిడుగు
X

కరోనా ముప్పు ఎప్పుడు ఎటు వైపు నుంచి ఎవరి మీద ఎలా ప్రభావం చూపిస్తుందన్నది అర్థం కాకుండా ఉంది. తాజాగా.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన ప్రకారం.. ప్రస్తుతం తెలంగాణ మాత్రమే కాదు. యావత్ దేశం ఆర్థిక సమస్యల్లో చిక్కుకుంది.

ఇలాంటి తరుణంలో రాష్ట్రానికి భారమైనా.. రైతులకు అన్యాయం జరగకుండా చూస్తున్నట్టు కేసీఆర్ చెప్పారు. అలాగే.. కరోనా పీడితులకు చికిత్స కోసం భారీగా ఖర్చు చేస్తున్న విషయాన్ని వివరించారు. ఇతర రాష్ట్రాల వారికీ ఆర్థిక సాయం చేయనున్న విషయాన్ని చెప్పారు.

ఇన్ని విషయాలు చెప్పిన ఆయన.. పనిలో పనిగా.. ప్రభుత్వ ఉద్యోగులపై పెద్ద బండ పడేశారు. ఈ నెల జీతాలు ఇచ్చే పరిస్థితి ఉంటదో.. ఉండదో అర్థం కాకుండా ఉందన్నారు.

రాష్ట్రానికి రావాల్సిన 12 వేల కోట్ల రూపాయలు ఆగిపోయాయని చెప్పిన కేసీఆర్.. ఎక్సైజ్ ఆదాయం లేదని… పన్నులు వసూలు కాలేదని… పెట్రోల్, డీజిల్ అమ్మకాలు తగ్గాయని… ఇతరత్రా ఆదాయ మార్గాలు మూసుకుపోయాయని… కేంద్రానిది కూడా ఇదే పరిస్థితి అని వివరించుకుంటూ వచ్చారు.

ప్రభుత్వ ఉద్యోగులు కూడా రాష్ట్రంలో భాగమే అన్న కేసీఆర్… కష్ట కాలంలో సమస్యను అందరూ పంచుకోవాలని పరోక్షంగా పరిస్థితిని వివరించారు. ఈ లెక్కన.. మరో రెండు రోజుల్లో పడాల్సిన జీతాలు.. పడతాయా? లేదా? అన్నదే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

First Published:  29 March 2020 9:00 PM GMT
Next Story